Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దిలావర్పూర్
మండలంలోని కదిలి గ్రామానికి చెందిన వాగ్మారే చంద్రకాంత్(15) ఎద్దు విద్యుద్ఘాతానికి గురై మరణించిన ఘటనలో చరడం స్నేహాకుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసామని ఎస్సై గంగాధర్ తెలిపారు. సదరు వ్యక్తి తన పంటను పందుల బెడద నుండి కాపాడుకునేందుకు చేను చుట్టూ విద్యుత్ తీగలు అమర్చి వాటికి కరెంటు కనెక్షన్ తొలగించకుండా నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఎద్దు, బాలుడు మృతి చెందారని తెలిపారు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విద్యుత్ తీగలు అమర్చిన వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించామని తెలిపారు. పంట పొలానికి అమర్చిన తీగలకు కరెంటు కనెక్షన్ ఇవ్వడం నేరం అని తెలిసి కూడా కరెంటు కనెక్షన్ ఇచ్చి నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.