Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి
నవతెలంగాణ-జైపూర్
ప్రజావాణికి అధికారులు విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. మండల పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కొనసాగిస్తున్న ప్రజా ఫిర్యాదుల విభాగానికి ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు అందరు విధిగా హాజరు కావాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసరా పింఛన్ కోసం వచ్చిన ధరఖాస్తును పరిశీలించి, వివరాలు సరి చూడాలని సూచించారు. భూసమస్య పరిష్కారం కోసం వచ్చిన ధరఖాస్తు పట్ల స్పందించిన కలెక్టర్ రెవెన్యూ రికార్డులతో పాటు స్థానిక స్థితిగతులు పరిశీలించాలని సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో మిగిలిపోయిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ క్రీడ ప్రాంగణం పనులు పూర్తి చేయాలని టీఆర్పీ సామాగ్రిని గ్రామ సర్పంచులు తెప్పించుటకు తగు విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన వారి నుండి అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు స్థానికంగా స్పందించాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మోహన్ రెడ్డి, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.