Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసిఫాబాద్ ఎస్పీ కె.సురేష్ కుమార్
- వరుస దొంగతనాల దొంగల పట్టివేత
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు దొంగతనాలకు పాలుపడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పొలీస్ ఏఆర్ హెడ్ క్వాటర్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను సోమవారం ఉదయం సుమారు 7 గంటలకు వాంకిడి పోలీస్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వాంకిడి ఎస్సై దికొండ రమేష్ సోమవారం ఉదయం 7 గంటలకు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి ఒక బులెట్ బండిపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలకు వారే కారణం అని ఒప్పుకున్నట్టు వివరించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వరుసగా 12 దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 6 కుమ్రంభీం జిల్లాలో 6 అని ఒప్పుకున్నట్లు వివరించారు. మొత్తం రెండు జిల్లాలో 123 గ్రాముల బంగారం, 5 కేజీల 61 గ్రాముల వెండి, 8500 నగదు, ఒక గడ్డపార, హెల్మెట్, ఫెస్ మాస్క్‌లు దొంగల వద్ద నుండి స్వాధీనం చేస్కున్నట్టు తెలిపారు. దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. దసరా సెలవులు రావటంతో ప్రజలు సొంత ఊర్లకు వెల్లటంతో అదే అదునుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఊళ్లకు వెల్లే వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటి చుట్టూ ప్రక్కల సిసి కెమెరాలు అమార్చుకోవాలని దీని వల్ల దొంగలను సులభంగా పట్టుకోవచ్చని తెలిపారు. సిసి కెమెరాలు పెట్టడం వల్ల దొంగలు బయపడి దొంగతనానికి పాల్పడే అవకాశం తక్కువ ఉంటుందని సూచించారు. చుట్టూ పక్కల ఎవరైనా అపరిచితులు అనుమానంగా కనిపిస్తే సమీప పొలిస్టేషన్ లేదా 100కి కాల్ చేయాలని సూచించారు. అనంతరం దొంగలను పట్టుకున్న వాంకిడి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై సిబ్బందికి అభినందనలు తెలిపి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్సై దికొండ రమేష్ పాల్గొన్నారు.