Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ఏపీఓ కనక భీంరావ్
నవతెలంగాణ-ఉట్నూర్
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ ఏపిఓ కనక భీంరావ్ అధికారులను ఆదేశించారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మారుమూల గిరిజన ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ దరఖాస్తులు అందజేశారు. వసతి గృహాల్లో ప్రవేశాలు ఉపాధి, ఆసరా పింఛన్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలంటూ మొత్తం 56 అర్జీలు అందాయి. సంబంధిత శాఖల అధికారులు సమస్యలపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి, పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీఓ జనరల్ భీంరావ్ ఆదేశించారు. ఈ ప్రజావాణిలో ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, ఐటీడీఏ ఓఎస్డీ కృష్ణయ్య, పీవీటీజీ ఏపీఓ ఆత్రం భాస్కర్, జేడీఎం నాగభూషణ్, బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, ఐటీడీఏ కార్యాలయ ఏఓ రాంబాబు, ఉద్యానవన శాఖ అధికారి సుధీర్, డీపీఓ ప్రవీణ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.