Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
- ఘనంగా ఐలమ్మ జయంతి
నవతెలంగాణ-ఆసిఫాబాద్
పెత్తందార్ల దోపిడి తనానికి అడ్డు నిలిచి తెలంగాణ తెగువతో మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అధికారికంగా ఆమె జయంతి వేడుకలు నిర్వహించి ఘనమైన నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి వేడుకలు నాటికి రజకులకు సంఘ భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, జడ్పీటీసీ నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్ బీసీ సంక్షేమ శాఖ అధికారి సత్యనారాయణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్, జిల్లాలోని అన్ని మండలాల రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాల : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతిని సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు పారిపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్త కొండ పోషం, కోశాధికారి నస్పూరి పోషం, సీనియర్ నాయకులు తోటపెళ్లి రాజయ్య, సంఘం నాయకులు నిమ్మ రాజుల కుమార్, జంగపెళ్లి సతీష్, ఏదుల్ల రాజం, నస్పూరి మల్లేష్, పున్నం చందు, పోచం పెళ్లి ధర్మయ్య, ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ నేరెల్ల రమేష్, బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దహెగాం : మండలకేంద్రంలో సోమవారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఐలమ్మ పోరాటం స్పూర్తి దాయకమన్నారు. రజకులంతా ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకుందామని రజక సంఘం మండలాధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు పుప్పాల సంతోష్, బీఎస్పీ యువజన సంఘం మండలాధ్యక్షుడు గౌతమ్‌తో పాటు రజక సంఘం నాయకులు లింగయ్య, మహేష్, నల్లూరి రమేష్, రాజు పాల్గొన్నారు.
జన్నారం : చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు ఎం.మల్లేష్, టౌన్ అధ్యక్షులు కే. కొమురయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రభుదాస్, నాయకులు డి.రమేష్, ఎం.రాజన్న, ఇమ్రాన్ పాల్గోన్నారు.
సిర్పూర్(టి) : వీరనారి చాకలి ఐలమ్మను నేటి తెలంగాణ యువత ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని ఎంపీడీఓ రాజేశ్వర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కౌటాల : కౌటాల మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆంజనేయులు, కళాశాల అధ్యాపకులు రామారావు, రాంబాబు, రవీందర్, రాందాస్, మోతిలాల్ నాయక్, సుభాన్, మహిళా అధ్యాపకులు సమతా, తస్లీమున్నీసా బేగం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.