Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాగజ్నగర్
వయో వృద్ధులను గౌరవించాలని సీనియర్ సిటిజన్స్ అసోషియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి పూర్ణచందర్రావు, నారాయణ సూచించారు. సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం స్థానిక కౌసర్నగర్-2 అంగన్వాడీ కేంద్రంలో వయోవృద్దులను వారి పిల్లలచే సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంట్లో పెద్దవారిని గౌరవించడం, ప్రేమగా చూసుకోవడం లాంటి సంప్రదాయ పద్దతులను చిన్న వయస్సులోనే నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సురేఖ, సూపరింటెండెంట్ పుష్పలత, సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, టీచర్లు శంకరమ్మ, శాంత, లక్ష్మి పాల్గొన్నారు.