Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దహెగాం
తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా కేసీఆర్ చీరలు అందజేస్తున్నారని జెడ్పీటీసీ తాళ్లపెల్లి శ్రీరామారావు, ఎంపీపీ కంబగోని సులోచన అన్నారు. మండల కేంద్రంలో గురువారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీపీ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం, మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనుక్షణం పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా బతుకమ్మ కానుక కానీ, ఇతర పండుగలకు కానుకలు కానీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రతిక్షణం ప్రజల బాగోగుల గురించే కేసీఆర్ ఆలోచన ఉంటుందన్నారు. అనంతరం మహిళలు మండల కేంద్రంలోని వారసంత స్థలంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చౌదరి సురేష్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సంతోష్‌గౌడ్, సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ఎంపీడీఓ రాజేశ్వర్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.