Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు అన్నారు.శనివారం ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో ఉపాధి కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేేంద్ర ప్రభుత్వం ఈఏడాది బడ్జెట్లో 60 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపులో ఏకంగా 30శాతం కోత పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకూలి రూ. 600 ఇవ్వాలని , రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు జాలపు లక్ష్మి కూరాకుల మల్లికార్జున్ బండ సిద్ధులు భూపల్లీ జాన్ చామలమ్మ రాములమ్మ బండ సబిత ఇక్కిరి మాయమ్మ తదితరులు పాల్గొన్నారు.