Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేరువేరుగా సంబరాలు
- అయోమయంలో కార్యకర్తలు, నాయకులు
నవతెలంగాణ-కోదాడరూరల్
ఇదేమి చోద్యమో గాని అధికార పార్టీలో వర్గ పోరు ఉంటుంది కానీ ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉండటం ఏంటి అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణంలో శనివారం రంగా థియేటర్ చౌరస్తాలో జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో పట్టణంలో రంగా థియేటర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం అదే ప్రదేశానికి భారీ బైక్ ర్యాలీతో రేవంత్రెడ్డి వర్గం పందిరి నాగిరెడ్డి రావడం టపాసులు కాల్చడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితితో అక్కడున్న కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. అధికార పార్టీని ఎలా ఓడించాలోనని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తుంటే ఇక్కడ మాత్రం వర్గపోరుతో కుదేలు అయ్యేలా ఉంది. ఎవరిని అడిగినా తమకే ఎమ్మెల్యే టికెట్ వస్తది అని చెబుతున్నారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వర్గ పోరుతో ఇతర పార్టీలకు కలిసి వస్తుందని వినికి బాగానే వినిపిస్తుంది.