Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కార్మికులు వట్టికూటి శ్రీను మృతి బాధాకరమని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ సంపేట ఉపేందర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని తోగర్రయి గ్రామానికి చెందిన వట్టికుటి శ్రీను అనే గీత కార్మికుడు శనివారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడి మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆదివారం కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కోదాడ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ సంపేట ఉపేందర్గౌడ్ వారి గ్రామానికి వెళ్లి భౌతికయాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డీ.లక్ష్మీనారాయణ, బాలేబోయిన వెంకయ్య, కొండలు, బాలేబోయిన వీరబాబు, ఉపేందర్, శ్రీను, రాములు, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.