Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు
నవతెలంగాణ- అడ్డగూడూరు
బునాదిగాని కాలువను సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రభుత్వాన్ని కోరారు. ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని శనివారం కంచనపల్లి,డి రేపాక, ఆజంపేట, ఎల్దేవి, మానాయకుంట, లక్ష్మీదేవికల్వ, బొడ్డుగూడెం, చౌల్ల రామారం, జానకపురంలో ముగించుకొని చివరకు మండల కేంద్రంలో అంబేత్కర్ చౌరస్తాలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సమస్యలు పరిష్కారం దిశగా అధికారులకు దష్టికి తీసుకెళ్తామన్నారు .మండలంలోని అన్ని గ్రామాలకు సాగు త్రాగునీరు అందించుటకు శాశ్వత పరిష్కారం బునాదిగాని కాలువ ద్వారా నీరు అందించాలన్నారు. మండలంలోని ఇసుక అక్రమ రవాణా ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్నినికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శ చేసినారు ..మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్ల రూపాయల దండుకుంటున్నారని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు చెడు చంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరులైన వారందరికీ రేషన్ కార్డులు, 57 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్, డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పల ముత్యాలు, తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు చెడపల్లి రవీందర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి మాకు వెంకటేష్,బెల్లి నాగయ్య, కుక్ నూరి సుధాకర్ రెడ్డి, బెల్లి శ్రీకాంత్, రేఖల హేమలత, సోలిపురం నాగిరెడ్డి, చీమల వెంకట రాములు, వెల్లంల రవి,డప్పు నరేష్, చెడు చుక్క ముత్తయ్య, బొబ్బిలి మహేష్, చేడ సురేష్, సుంకనబోయిన విజరు, చేడే ప్రమీల, చెడ ఉపేంద్ర,తదితరులు పాల్గొన్నారు.