Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
- చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలే కారణమంటున్న కౌన్సిలర్లు
- ఒకరిపై ఒకరు విమర్శలు
- ఇతర పార్టీ నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు
- కావాలనే బురదజల్లే ప్రయత్నం
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నందికొండ రూలింగ్ పార్టీ లీడర్ల మధ్య ఇన్నాళ్లూ సైలెంట్‌గా నడిచిన గ్రూపు రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. ఏప్రిల్ 8 వ తేదీన ఆత్మీయ సమ్మేళనంను నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి ఏకంగా 7మంది కౌన్సిలర్లు హజారుకాలేదు. దీంతో కౌన్సిలర్లు సమావేశానికి రాకపోవడంతో నందికొండలో హాట్ టాపిక్‌గా మారింది. అదే విధంగా ఈనెల 9వ తేదీన నందికొండ మున్సిపాలిటీలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని నందికొండ బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. బహిరంగంగానే మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనూష రెడ్డి, కమిషనర్ రవీందర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు మేం మద్దతు ఇవ్వలేమని, వార్డులలో పేర్కొన్న సమస్యలపై ఎలాంటి సమీక్ష నిర్వహించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టం వచ్చిన్నట్లుగా (వారికి ఆర్థికంగా ప్రయోజనం ఉన్నా) ప్రియంబుల్స్ని రెడీ చేసి ఎజెండా అంశంలో పొందుపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అభివృద్ధి పనులకు సహకరించని చైర్‌పర్సన్‌్, కమిషనర్‌పై అసహనం వ్యక్తం చేసి సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. ఇప్పటికే చైర్పర్సన్్్పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కూడా తీరు మారలేదని అసహనం వ్యక్తం చేశారు. వీటన్నిటిని నిశ్శబ్దంగా గమనిస్తున్న క్యాడర్ అసలు ఎంజరుగుతుందో తెలియక పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ మా నాయకుడికే అంటూ.. కాదు మా నాయకుడికే అంటూ పలువురు గులాబీ నేతలు ఎమ్మెల్యే భగత్ వర్సెస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. నందికొండలో సిట్టింగ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. నందికొండలో బలంగా ఉన్న బీఅర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు అగ్గిలా రాజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈక్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ప్రత్యర్థులుగా మారుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ రెండు వర్గాలుగా చీలిపోతున్న క్యాడర్ పరస్పరం బురదజల్లుకుంటున్నారు.
చైర్మెన్ వర్సెస్ కౌన్సిలర్ల మధ్య కొనసావుతున్న కోల్డ్ వార్
నందికొండ మున్సిపాలిటీలోని 12వార్డులకు గాను 9 వార్డులు అధికార పార్టీ కౌన్సిలర్లు కాగా ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కాగా రెండవ వార్డు కౌన్సిలర్ సత్తెమ్మ హఠాత్మరణంతో ఖాళీ అయింది. మొదట్లో చైర్పర్సన్్కు కౌన్సిలర్లు సహకరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఆతరువాత మొదలైంది అసలైన లొల్లి. మున్సిపాలిటీలోని నిధులు చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్‌ను మార్చాలనే ఉద్దేశంతో కొందరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఒకటై ఆవిశ్వా తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్ 8న ఆత్మీయ సమావేశం నిర్వహించినప్పటికీ కౌన్సిలర్లు రాకపోవడంతో నందికొండ పట్టణంలో చర్చనీయంగా మారింది. కొందరు కౌన్సిలర్లు ఆహ్వానం లేదని అంటుంటే, ఇంకొకరు ఎన్ని సార్లు విన్నవించినా ఎమ్మెల్యే మా వార్డును అభివృద్ధి పట్టించ్చుకోలేదని అందుకే హాజరు కాలేదని అంటుండటం విశేషం. ఇటీవల నందికొండలో వేసిన అంతర్గత రోడ్ల విషయంలోను ఎమ్మెల్యే అనుయాయులకే కేటాయించడం జరుగుతుందని కోటిరెడ్డి వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదీ ఎమైనప్పటికి నందికొండ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లుగా సాగుతున్న కోల్డ్ వార్ ఏ పరిణామాలకు దారి తీస్తోందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
కావాలనే బురదజల్లే ప్రయత్నం...
చైర్పర్సన్ అనూషరెడ్డి
ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నామని, కావాలని ఎమ్మెల్యే నోముల భగత్ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర ప్రోగ్రామని అందరికీ సమాచారం అందించాం. కావాలని కొంతమంది కౌన్సిలర్లు సమాచారం ఇవ్వలేదని తెలపటం భావ్యం కాదు. నందికొండ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మొదట ఒకటో వార్డు నుండి చేపట్టి అన్ని వార్డులలో పూర్తి చేస్తున్నాం. సీసీి రోడ్ల నిర్మాణం ఒక్క రెండు చోట్ల చిన్న,చిన్న విధుల్లో ఆగిన నిర్మాణం చేపడుతున్నాం. ప్రతిపాదనల్లో ఉన్న సమస్యలు తెలపకుండా ఈలాంటి నిందలు వేయడం సబబు కాదు. అభివృద్ధి ఎక్కడ జరగలేదు. అన్ని వార్డులు అభివృద్ధి జరుగుతుంది.నందికొండలో జరుగుతున్న అభివృద్ధి ఏ మున్సిపాలిటీలో జరగటం లేదని అన్ని కౌన్సిలర్ల ఆధ్వర్యంలోనే జరుగుతుందని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.
ఎమ్మెల్యే, చైరపర్స్న్ ఒట్టేద్దు పోకడలే కారణం
కౌన్సిలర్ రమేష్
శాసనసభ్యులు నోముల భగత్, చైర్ పర్సన్ కర్ణ అనూషరెడ్డి ఒంటెద్దు పొకడల వల్లనే కౌన్సిలర్లను పట్టించుకోకుండా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వచ్చిన నాయకులకే పెద్ద పీట వేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో ఎన్నడు మమ్మల్ని పట్టించుకోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. అలాంటి మాకు కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. బై ఎలక్షన్లలో కష్టపడి నోముల భగత్ కు హిల్ కాలనీలో 300 పైగా మెజార్టీని తీసుకువచ్చాం. ఇంత కష్టపడి పార్టీని గెలిపించుకున్న వారిని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మాకు నచ్చలేదు.