Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూకాలు విషయాలు తేడాలు జరిగితే కఠిన చర్యలు
- లీగల్ మెట్రాలజీ అధికారులు సంజరు కృష్ణ
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
మండలంలోని రామలింగంపల్లి శివారులో గల కన్యకా పరమేశ్వరి రైస్ మిల్ లో ధాన్యం తూకంలోతేడాలు వస్తున్నాయని శుక్ర వారంరాత్రి రైతులు ఆందోళన శనివారం కూడా కొనసాగింది. కాగా వీరికి అఖిలపక్ష నాయకులు మద్దతుతో ధర్నాని కొనసాగించారు. ఈ విషయం తెలుసుకొని జిల్లా తూనికలు ,కొలతల అధికారి సంజయ్ కృష్ణ రైస్ మిల్లు సందర్శించారు. ఈ సందర్భంగా వేయింగ్ మిషన్ పరిశీలించారు. వేయింగ్ మిషన్ పై బాట్లతో కొలత వేయగా తేడాలు ఏమి లేకపోవడంతో మళ్లీ ధాన్యం వేసిన లారీ లోడని వేయింగ్ మిషన్ పై తీసుకురాగా 49 వేల కిలోలు కేవలం 70 కిలోల తేడా మాత్రమే వచ్చింది. అది కూడా మధ్యలో పెట్టినప్పుడు ఒక మాదిరిగా మూలలో పెట్టినప్పుడు ఒక మాదిరిగా కొలతల్లో తేడా మిషన్ చూపుతుందని గమనించిన వేయింగ్ మిషన్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు ధాన్యం తూకం వేయించినప్పుడు ఎక్కడ చూసినా ఒకే విధంగా రావాలని కానీ మధ్యలో పెట్టినప్పుడు ఒక మాదిరిగా కొనలకు పెట్టినప్పుడు ఒక మాదిరిగా తూకం తేడా చూపుతోందని తెలిపారు. మరోసారి వచ్చి యంత్రాన్ని సాంకేతిక పరంగా పరీక్షలు ఇస్తామని న తెలిపారు.రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపము అని రైతుల ఆందోళన ఉధృతం చేయగా ఇది తెలుసుకున్న చౌటుప్పల్ రూరల్ సీఐ మహేష్, పోచంపల్లి ఎస్సై విక్రం రెడ్డి బందోబస్తు మధ్య రైతులు, అధికారులతో చర్చలు నిర్వహించారు. మిల్లులో తూకంలో తేడా తరుగు కింద రెండు మూడు కిలోల తేడాలు జరుగుతున్నాయని ,వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా జిల్లా అధికారులకు సోమవారం రైస్ మిల్లును పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు నోముల మాధవరెడ్డి, కోట రామచంద్రారెడ్డి, భీమ గాని నరసింహ, చింతల శ్రీశైలం, ఉప సర్పంచ్ మండల నరసింహ, ఉడతల సాయిరాం, గరేసా జంగయ్య, రరమావత్ రాజు, పెద్దిరెడ్డి యాదగిరి, వారాల రామచంద్రారెడ్డి, పానగంటి లింగస్వామి పాల్గొన్నారు.