Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్
నవతెలంగాణ -మోత్కూరు
పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మోత్కూరు శాఖా గ్రంథాలయ ఆవరణలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆయిల్ ఫెడ్ సంస్థ నుంచి మంజూరు చేయించిన రూ.10 లక్షలతో నిర్మించనున్న అదనపు భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం ద్వారా ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చని, విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని కోరారు. మోత్కూర్ గ్రంథాలయం దాతల నుంచి పుస్తకాల సేకరణ, గ్రంథాలయ అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. బీఆర్ఎస్ 1వ వార్డు అధ్యక్షుడు అన్నందాసు విద్యాసాగర్ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి అనంత చేతుల మీదుగా గ్రంధాలయానికి రెండు ర్యాకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మెన్ బొల్లేపల్లి వెంకటయ్య, మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మెన్ డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొండా సొంమల్లు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, కౌన్సెలర్లు లెంకల సుజాత, దబ్బెటి విజయ, కోఆప్షన్ సభ్యులు గనగాని నర్సింహ, పోలినేని ఆనందమ్మ ఎండి.శాహిన్ సుల్తానా, గ్రంథాలయ వైస్ చైర్మెన్ పోలినేని స్వామి రాయుడు, డైరెక్టర్లు అన్నందాసు రామలింగం, దొంతోజు శ్రీనివాస్, నిలిగొండ కృష్ణ, దేవరపల్లి నర్సిరెడ్డి, లైబ్రరీ ఇంచార్జీ చిలకమర్రి బాబుచారి, కల్వల ప్రకాష్ రాయుడు, జంగ శ్రీను, కందుల విక్రాంత్, దాసరి తిరుమలేష్, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన గిన్నాల కనకాచారి కూతురు స్వాతి వివాహానికి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ను ఆహ్వానించగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాసోజు శంకరమ్మను ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకొని రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.