Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎవరు రాయగలరు... అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.....
ఎవరు పాడగలరు... అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం....
అమ్మేగా, అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి' అమ్మ రాజీనామా సినిమా లోని ఈ పాట అమ్మ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. అమ్మ ఆ పిలుపే ఓ మధుర స్మృతి. ఆ జ్ఞాపకమే ఒక దైర్యం. ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ.. తొమ్మిది నెలలపాటు కడుపులో ఉన్న బిడ్డ కోసం తపస్సు చేసి శిశువుకు జన్మనిచ్చే తల్లి కోసం ప్రపంచ వ్యాప్తంగా నేడు మాతృదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం.
ఈ సందర్భంగా అమ్మలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ.. సినీరంగంలోని
యువతరంగాలు తమ అమ్మతో ఉన్న అనుబంధాన్ని నవతెలంగాణ జోష్‌తో
పంచుకున్నారు.
స్వార్ధం లేని ప్రేమ...
ప్రపంచంలో స్వార్ధం లేని ప్రేమ ఇవ్వగలిగే గొప్ప వ్యక్తి అమ్మ. ఇంకా మా అమ్మ శ్రీ లక్ష్మి విషయానికి వస్తే నా ఎడ్యుకేషన్ విషయం నుండి ప్రస్తుతం తీసే సినిమాల స్టోరీ డిస్కషన్ వరకు ప్రతిదీ అమ్మ తో షేర్ చేసుకుంటాను , కథ విన్నాక, సినిమా చూసాక ఒక ఆడియన్ గా తన ఫీడ్ బ్యాక్ జెన్యున్ గా చెప్తుంది. లైఫ్ లో ఎప్పుడు అమ్మ నాన్నలు సంతోషం గా ఉండాలని ఏదోఒకటి చేస్తూ ఉంటాను,కానీ లాస్ట్ 15 రోజుల క్రితం కరోనా వలన అమ్మ హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు మాత్రం మొదటి సారి అమ్మ కోసం ఏడ్చాను, అమ్మ ని అలా చూడడం తట్టుకోలేక పోయాను, కరోనా తో బాధ పడుతున్న సమయంలో సడెన్ గా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడితే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు, ఆ క్షణమే హైదరాబాద్ నుండి నైట్ ఇంటికి బయలుదేరాను, ఆ నెక్స్ట్ డే అమ్మ ని కిటికీ లో నుండి చూసాను , ఆ క్షణం నేను అమ్మని చూసి ఫీల్ అయిన మూమెంట్ లైఫ్‌లో ఎప్పుడు మరువలేనిది.ఆ దేవుడి దయ వలన అమ్మ ఆరోగ్యం బాగుంది . నా భవిష్యత్ కి మొదటి ప్రోత్సహం అమ్మే...!!
- తల్లాడ సాయి కృష్ణ, ఫిల్మ్ డైరెక్టర్, హీరో
నా ఇన్స్ప్రెషన్ మా అమ్మ ...
మా అమ్మ నా ఇన్స్ప్రెషన్ , ఈ రోజు నేను నా ఎయిమ్ని ఫోకస్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నాను అంటే కారణం అమ్మ వలనే , ఎప్పడూ అమ్మ ఒక మాట చెప్తూ ఉంటుంది , మనం ఎంత చదువుకున్నది అనేది కాదు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని. నా ప్రతి స్టెప్ లో అమ్మ తోడుగా ఉంటుంది. నేను ఎన్ని సార్లు పడిన నిల్చునేలా చేస్తుంది అమ్మ. పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ అటు డ్యూటీ, ఇటు ఫ్యామిలిని చూసుకుంటూ మా నాన్నకి తోడుగా ఉంటుంది.
- వివేకానంద విక్రాంత్, దక్ష సినిమా డైరెక్టర్
ప్రతి పని మా ఆనందం కోసమే ...
అమ్మ చేసే ప్రతి పని తన పిల్లల ఆనందం కోసమే తన పిల్లల ఆనందంలో తన సంతోషాన్ని ఆనందాన్ని చూసుకుంటుంది. నా దృష్టిలో మా అమ్మ చాలా గొప్పది ఎందుకంటే నేనూ పుట్టాక కొన్ని నెలల లోనే మా నాన్నగారికి జ్వరంతో కాళ్ళు పడిపోయాయి గత 26 సంత్సరాలుగా మా నాన్న గారు ఇంటికే పరిమితం అప్పటి నుండీ ఇప్పటివరకు మా నాన్న గారిని ఒక చంటిపిల్లాడిలా చూసుకుంటుంది ఇంకా ఆ సమయంలో ఇంట్లో పరిస్థితుల ప్రభావం నాన్న ఆరోగ్యం వల్ల నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టింది . మా అమ్మ అప్పటినుండి మా నాన్న సలహా సూచనల మేరకు అన్ని తానే అయి చూసుకుంటుంది కుట్లు అల్లికలు నేర్చుకుంది మెషీన్ కుట్టేది గిర్ని పట్టడం నాన్న పెట్టిన కేబుల్ చూసుకోవడం ఒక్కటేమిటి చాలా కష్టపడుతూ వచ్చింది మా అమ్మని చూస్తే నాకూ నిజంగానే గర్వంగా ఉంటుంది మా అమ్మకి ఉన్నంత ఓపిక కష్టపడే తత్వం మా అమ్మ నుండే వచిందనిపిస్తూంటుంది నాకు ఇక నేనూ ఒక అమ్మని అలాగే ఒక ఫ్యాషన్ డిజైనర్ నీ నేనూ నా వృత్తి పరంగా నా పని నేనూ చేసుకోవాలి ఇంట్లో ఉంటే నా పనులు అవ్వవు కాబట్టి కచ్చితంగా బయటకి వెళ్లాల్సి ఉంటుంది బయటకి వెళ్తూ వస్తు ఉండటం వల్ల కరోనా ఎలా వచ్చేది తెలీదు పిల్లల వరకి వచ్చేవరకు ఛాన్స్ తీసుకోకూడదు అని పిల్లల ఇద్దరినీ వాళ్ళ తాత వాళ్ళ దగ్గర వదిలేసాను 2 నెలల నుండీ దూరంగా కలవకుండా ఉన్నాను చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది కాని ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం కాబట్టి మనసు గట్టిగా చేసుకొని వదిలి ఉంటున్నాను తొందరగా ఈ మహమ్మారి నుండీ బయట పడి అందరూ ఆరోగ్యముగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
- రితీషా రెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, డైరెక్టర్
నన్ను నడిపించిదే మా అమ్మ ...
కొందరి లైఫ్లలో సక్సెస్ లో బ్రదర్ - సిస్టర్ రోల్స్ ఉంటాయి, మరి కొందరి సక్సెస్‌లో ప్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. కానీ నా లైఫ్ లో ప్రతి స్వీట్ మూమెంట్లో నన్ను నడిపించింది నాకు సపోర్ట్ ఇచ్చింది మా అమ్మే, ఒక ప్రెండ్ గా, సిస్టర్ గా, బ్రదర్ గా ,చివరకి ఒక శ్రేయోభిలాషిలా నా వెంట ఉంది అమ్మ మాత్రమే. తను కొన్ని సమయాల్లో రీస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే ఫీల్ అయ్యే దాన్ని కానీ ఆ రీస్ట్రిక్ట్స్ నాకు చాలా సమయాల్లో హెల్ప్ అయ్యాయి. మా అమ్మ పడిన ఇబ్బందులు నేను పడకూడదు అని తాను నాకు సపోర్ట్ చేసేది అని అర్థం అయ్యేది. అందికే ఎప్పటికి మా అమ్మే నాకు రోల్ మోడల్.
- నక్షత్ర, సినీ హీరోయిన్
ప్రాణం పొయ్యడానికి .. తన ప్రాణం పనంగా పెడుతుంది! ...
బిడ్డకి జన్మ నివ్వడానికి ..
తను పూజలు ఎన్నో చేస్తుంది!
కడుపులో తంతే ..
బిడ్డ కదులుతోంది అంటూ ..
తాను సంబర పడుతుంది !
ప్రాణం పొయ్యడానికి ..
తన ప్రాణం పనంగా పెడుతుంది!
మొదటి అడుగు వేస్తుంటే ..
తను తడబడుతూ చూస్తుంది !
గుక్కపెట్టి ఏడిస్తే ..
తను గుక్కతిప్పక లాలి పాడుతుంది!
మొదటి సారి అమ్మ అని పిలిస్తే ..
లోకాన్ని గెలిచిన ఆనందం తో ..
గుండెలకి హత్తుకుంటుంది !
మధ్య లో వచ్చే స్నేహితుల్లా కాదు ..
దూరం గా వుండే బందువుల్లా కాదు ..
పూజ చేస్తేనే వరమిచ్చే దేవుళ్ళా కాదు ..
నీకు ప్రాణం పోసింది మొదలు ..
తాను అలసి పోయి ...
నీ కోసం ఓడిపోయి ...
అనువణువు ఆవిరై పోయి ..
నిన్ను మనిషి గా మలిచి, గెలిపించేదేరా అమ్మ!
అందుకే అమ్మని పూజించే వాడు ..
అందరిచే ప్రేమించబడుతాడు, గౌరవించబడుతాడు!!
- వి శివ కె కాకు , డైరెక్టర్&రైటర్
ప్రేమ అనే మాటకు అర్థం మా అమ్మ ...
ప్రేమ అనే మాటకు అర్థం చూపిన మా అమ్మ బ్రతుకు అనే జీవన ప్రయాణంలో ఈ నాటికి నా పక్కనే ఉంటూ తోడుగా చెయ్యి అందిస్తారు మా అమ్మ రకరకాల మనుషులు ఎన్నో రకాల భావనలను వ్యక్తపరిచే స్నేహితుల ఉన్నా నా లోకం లో కొన్ని సంవత్సరాలుగా ఒకే రకమైన స్నేహ భావంతో ప్రేమను పంచుతున్న మా అమ్మ ఎన్నిసార్లు తడబడిన ఎన్ని సార్లు కింద పడిన నీకు నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పిన మా అమ్మ ఏ దారిలో వెళ్లినా ఏ సముద్ర తీరం దాటినా భయపడకుండా నన్ను చెయ్యి పట్టి నడిపించిన మా అమ్మకుమితి మీరిన భాషణం ఉండదు. మితి మీరిన ఆశ ఉండదు. మితిమీరిన ఏషం ఉండదు అమ్మ ప్రేమకు , ఏమిచ్చి ఋణం తీర్చు కోవాలి పేగు బంధాన్ని అందుకే అత్యంత ప్రేమ కలిగిన ప్రియమైన మా అమ్మ కు మాతృదినోత్సవ శుభాకాంక్షలు లవ్ యు అమ్మ.
- విజయ్ నిట్టాల, రైటర్
అమ్మని గౌరవిద్దాం... అమ్మని ప్రేమిద్దాం...
బిడ్డ కూడా తెలియని ఆకలిని మొదటసారి రుచి చూపించే దేవత అమ్మ... ఈ భూమ్మీద నువ్వు ఇలా ఆనందంగా బ్రతకడానికి కారణం అమ్మ మాత్రమే.. సృష్టి సిగలో నీకో స్థానాన్ని కలిపించి ఆమె కరిగిపోతు నీ జీవితానికి వెలుగునిచ్చే ఒకె ఒక్క దైవం అమ్మ అందుకే అమ్మని గౌరవిద్దాం... అమ్మని ప్రేమిద్దాం.... అమ్మలందరికి ''మదర్స్ డే శుభాకాంక్షలు''
- శాంతి స్వరూప్, జబర్దస్త్ నటులు
అమ్మ ప్రేమని వేల కట్టలేము...
సృష్టిలో అమ్మని మించిన దేవుడు లేదు, నవ మాసాలు మోసి కన్న అమ్మ ప్రేమని వేల కట్టలేము, మనం ఎన్ని తప్పులు చేసిన సరే మనల్ని ఎప్పటికి ప్రేమించే గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కరే. అలాంటి అమ్మ కి మనం ఎన్ని చేసిన తక్కువే, అమ్మ నాన్నలని ప్రేమగా చూసుకుంటే ఈ సమాజంలో వృద్దాశ్రమాలు ఉండవు .అమ్మలందరికి మదర్స్ డే శుభాకాంక్షలు.
- స్వప్న చౌదరి అమ్మినేని, 'నమస్తే సేట్ జీ' సినిమా హీరోయిన్
గుండెల్లో పెట్టుకుని చూసుకునేదే అమ్మ...
అమ్మ.. తొమ్మిది నెలలు కడుపులో, తర్వాత గుండెల్లో పెట్టుకుని చూసుకునేదే అమ్మ.. ఇప్పటివరకూ, కసాయి కొడుకులు ఉన్నారు కానీ, కసాయి తల్లి లేదు. అదే తల్లి గొప్పదనం. బహుశా ఈ కరోనా కి తల్లి లేనట్టుంది అందుకే ఇలా మన బంధాలతో ఆడుకుంటుంది. తల్లులందరు, మీరు ఆరోగ్యంగా, భద్రంగా ఉండాలని కోరుకుంటూ ఇవే నా శుభాకాంక్షలు.
-భద్రం, సినీ నటుడు