Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదేంటో అమ్మ మీద ఎంత రాసినా
ఎంతో కొంతే రాసినట్టు ఉంటుంది...
గుండె తడి చేయమని
పొడి బారుతూ ఉంటుంది.....
రొండంగుళాలు ఆటో ఇటో
అమ్మ ఐదడుగుల ఆరు అంగుళాల
కవిత్వం అనిపిస్తుంది.....
అమ్మ పది కూడా పాస్ అవ్వలేదు అనుకుంటావేమో
ప్రపంచం మొత్తంలో అమ్మే అతి పెద్ద క్వాలిఫికేషన్...
నీకు తెలిసిన రహస్యమొకటి ఎక్కడుందో చెప్పమంటే
అమ్మ ఆఖరున అన్నం తినటంలో ఉందని చెబుతాను ..
అమ్మ నాన్నతో సమానం అంటే నేనొప్పుకోను
నాన్న అమ్మతో సమానం అన్నా నేనొప్పుకోను
ఈ ఇద్దరూ బిడ్డ ఒంటి చక్రపు రైలును మోసే
సరళ రేఖీయ పట్టాలు .....
అమ్మంటే నెలలో 30 రోజుల కష్టమే కాదు
మూడురోజుల రక్తస్రావం కూడా...
అమ్మ ఇంటి నదిలో తనని తాను నాటుకున్న
కదలకుండా ప్రవహించే చెట్టు
ఊట బావిని కళ్ళల్లో కూరుకున్న అమ్మ
నువ్వో నేనో చూస్తున్నప్పుడు
ఉబుకుతున్న కన్నీళ్ళని గొంతులోకి మింగటం
ఎక్కడ నేర్చుకుందంటావ్ ?
మీ అమ్మ జీవుతమంతా ఏం చేసింది అంటే
నేను మాత్రం మా ఇంటిని ప్రేమించిందనీ,
ప్రేమించటం అమ్మ సహజ లక్షణం అనీ చెప్తాను..
- సిద్దార్థ కట్ట