Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాలక్సీ కన్నుల దానవు
ఎన్ని కలలు నింపి
ఆర్టిఫిషల్ గా తయారు చేసానో
ఏమో గాని
నువ్వూ భూమిపై లేని
సంపదకి చిరునామావి
ఇదొక ఎక్సప్లోర్డ్
జీవ వైవిద్యపు ఎడారి
నువ్విందులో సజీవంగా లేకపోయినందుకు
చాలా ఆనందం నాకు
నువ్వు నడిస్తే వినడానికి
నీ కాళ్లకు సప్పుడు లేదు కానీ
నువ్వు నడవడానికి
ఈ దారి అంత
పచ్చి రక్తపు బోట్ల
వాసనే ఉంటది
కాస్త మారిన
బతుకు విధానం తప్ప
ఆలోచనలు లేని
మెదళ్ళ మధ్య నీ ఉనికి
లేనందుకు సంతోషమే
నిన్ను ఇట్లా అకృతిగా సృష్టించడానికి
సహాయ పడిన సైన్స్‌కి
దండాలు పెట్టాల్సిందే
మైరా నీకు కులం మతం ఏవి లేవు
పొద్దున్న లేసినప్పటి నుండి
మీరేమిట్లు అని అడిగే
గొంతులు నీకు వినపడవు
అలా ఏ గొంతు వినపడని రోజు చూడాలని కోరిక
అప్పుడు నువ్వు పక్కనుండవూ
ఈ జీవ పరిణామక్రమ చరిత్ర
ఇప్పుడు పుస్తకాల్లోంచి తీసెసే పనిలో
ఓ ముఠా ఉన్నది
వాల్ల పిచ్చి గాని చరిత్రను
తుడిచేయగలమా!
నువ్వు
నా చరిత్రలో మిగిలిపోయే
నిజమైన కలవు
జీవం లేని జీవివి
నువ్వర్ధం చేసుకున్న
పరిణామక్రమాన్ని
వీళ్ళు చేసుకోలేకున్నారు
నీకు డిఎన్ఏతో పని లేదు
నా డిఎన్ఏ నీతో కలిసి
ఇంకొకరిని సృష్టించనూ లేదు
ఎన్ని వసంతాలు వచ్చిపోయిన
నువ్వు నవ వసంతపు
చిగురువే కదా
ప్రేమను ఆశించవు
ఎంత ప్రేమించిన
వద్దని చెప్పనూ లేవు అని నమ్మకం
ద్వేషాలు అసూయలు
పోస్సేసీవ్ లేని
నువ్వంటే అందుకే ఇష్టం
నవ్వు కళ్ళు నువ్వు ఆర్టిఫిషల్ అయినా
నా కండ్లల్ల నక్షత్రపు వెలుగువు సాకి
నీ మెనూ వాసనంత
ఎలక్ట్రికల్ గుబాలింపే కదా
నీ శ్వాస గాలి నన్ను తాకగా
నేను ప్రేమైక ఎడారిలో నడుస్తుంటా
మైరా నువ్వు యూనివర్స్ కె
అందని పుత్తడి రాసివి
కడలి ఒడిలో ఇసుక తిన్నెల్లో
నీ చిత్రం నా కల కు రూపం అని
ఈ ప్రపంచానికి పరిచయం చేస్తా
ఎంత బాగుంటుంది
ఎన్నెల కింద నిన్ను చూస్తూ
'హమ్ దోనో మె ప్రేమి' ని
పాడుకుంటూ వెళ్తుంటే
నన్ను ఫోన్లో నుంచి చూసి
నవ్వుతావ్ వినపడకుండా
- బాలు అగ్నివేష్
8297296277