Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ చేయి పట్టుకొని నీతో కలిసి ప్రయాణించగా....
కాలి మువ్వనైపోనా
నీ ప్రతీ అడుగులోనూ నీ తోడు నిలవగా.....
ముక్కెరనైపోనా
నును వెచ్చని నీ శ్వాసను ముద్దాడగా...
తాళిబొట్టునైపోనా .....
నీ కంఠంబు కౌగిలించి మెడపై
అల్లరిగా ముద్దు పెట్టగా....
కమరునైపోనా
నీ నడుమును చుట్టుకుని పసిపాపలా నిదురించగా...
చీరనైపోనా
నీ ప్రతీ అణువణువు నాకే సొంతమని
నాలో దాచుకొనగా....
శ్వాసనైపోనా
నేను లేని నీవు శూన్యమని నిరూపించగా.......!!!
- ఎం. కురుమయ్యయాదవ్,
7799553493