Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటంటే అతనికి ప్రాణం. చిన్నప్పటి నుంచి స్వరాలతో కాలక్షేపం చేస్తూ పెరిగాడు. సరిగమలతో సహవాసం చేస్తూ, పదనిసలతో పరుగులు తీస్తూ పాటతో దోస్తానా చేస్తున్నాడు. ఆ సోపతే నేడు అతడ్ని ప్రొఫెషనల్ నేషనల్ సింగర్ గా నిలిపింది. మాటలను పాటలుగా పాడేయగల మధుర గాయకుడు.. సుప్రసిద్ధ గాయకుడు ఏసుదాస్ ని రోల్ మోడల్ గా భావించాడు అనే కంటే ఆయనకు ఏకలవ్య శిష్యుడంటే సరిగా సరి పోతుంది. సంగీతం లో సరిగ మలు తెలియవు. మెలకువలు నేర్పిన గురువులు లేరు. ఓ పాటను శ్రద్ధగా వింటే చాలు. గాయకుడె వరైనా గొంతును ఇట్టే అనుకరించగల నేర్పరి. కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన యాదగిరి అజయ్ కుమార్. గాత్రంలో శిక్షణ తీసుకోకుండానే ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. తన గాత్రంతో హృదయాలను కొల్ల కొడుతూ.. పాట బాట పట్టి.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపైన పాడుతూ 'వాయిస్ ఆఫ్ ఏసుదాస్' అవార్డు అందుకున్న యాదగిరి అజయ్ ఏసుదాస్ పరిచయం అతని మాటల్లోనే...
మాది ఖమ్మం జిల్లా పల్లిపాడు. అమ్మా నాగ పుష్పలత, నాన్న వేంకటేశ్వర్లు. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న ఊరూర తిరిగి బండిపై బట్టలు అమ్ముతారు. అంతే కాదు నాన్న మంచి గాయకుడు. నాకు ఊహ తెలిసినస్పటి నుండి నాన్న పాటలింటూ పెరిగాను. నాన్నతో అప్పడప్పుడూ స్వరం కలిపే వాణ్ని. అలా పాట బాట పట్టాను. ఏసుదాస్ గారి గొంతంటే నాకేందుకో చెప్పలేన్నంత ఇష్టం. ఆయననే నా గురువుగా భావించాను. ఆయన పాటలు వింటూ పాడటం నేర్చుకున్నాను. కొన్ని స్టేజ్ షోలు చేశారు. అయ్యప్ప పాటలు సొంతంగా రాసి పాడేవాణ్ని. అలా నేను రాసిన అయ్యప్ప పాటలుకొన్ని విడుదలయ్యాయి. 'తత్వమసి పౌరుడే అనే నేను రాసిన పాట గతేడాది నవంబర్ నుంచి నిత్యం శబరిమల సన్నిధానంలో సుప్రభాతం తర్వాత వినిపిస్తుండటం నాకు గొప్ప అదృష్టం. అదే విధంగా కొన్ని సినిమా పాటలు పాడాను. ఇప్పుడు కొన్ని ప్రయివేట్ ఆల్బమ్స్ చేస్తున్నాను. 'వాయిస్ ఆఫ్ ఏసుదాస్' అనే అవార్డ్ గెలిచి, తన పేరు పక్కన ఏసుదాస్ అనే పేరుని సాధించి'అజయ్ ఏసుదాస్'ను అయ్యాను.
వైరాలో ఠాగూర్ విద్యాలయంలో హైస్కూల్ విద్య, క్రాంతి జూనియర్ కళశాలలో ఇంటర్ పూర్తి చేశాను. డిగ్రీ ఖమ్మం కవిత మెమోరియల్ కళాశాలలో డిఎడ్ విద్య బ్రౌన్స్ కళాశాలలో పూర్తి చేశాను. ఓ ప్రముఖ టెలివిజన్ విజయవాడలో నిర్వహించిన పోటీల్లో ఉభయతెలుగు రాష్ట్రాల నుండి 3600 మంది పాల్గొన్నారు. అందులోనూ ప్రతిభ చాటాను. మరో జాతీయ టీవి చానల్ హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో 3800మందితో పోటిపడి ప్రథమస్థానంలో నిలిచాను. స్టార్ భారత్ టీవి నిర్వహించిన సింగింగ్ కాంపిటీషన్ విజేతగా నిలిచి 'వాయిస్ ఆఫ్ ఏసుదాస్ టైటిల్ సాధించాను. ఆ తరువాత వివిధ పోటీల్లో అనేక మంది ప్రశంసలందుకున్నాను. 'జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అంటూ న్యాయనిర్ణేతల మరో టైటిల్ నాకు ఇచ్చారు. ఇంతా నిజమేనా అని అనిపిస్తోంది.
నా వింతగాథ వినుమా అనే లఘు చిత్రాన్ని తీశాడు. టీవీ సిరీయల్స్‌కు కూడా పాటలు పాడుతున్నాడు.
సామాజిక సేవలోనూ...
అజయ్ కుమార్ గాత్రంతో పాటు సామాజిక సేవలోనూ ముందున్నాడు. ప్రతి మూడు నెలలకు ఒకసారి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేస్తున్నాడు. గ్రామంలో ప్రెండ్స్ యూత్ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడు. సామాజిక కార్యక్రమాల్లో తన వంతు సాయంగా పాటలు పాడేందుకు ముందు వరసలో నిలుస్తాడు.
సత్కారాలు - అవార్డ్స్
- నేషనల్ కాంపిటీషన్లో ప్రథమ స్థానంలో నిలిచి 'వాయిస్ ఆఫ్ ఏసుదాస్' టైటిల్
- రెండవ నేషనల్ కాంపిటీషన్ లోనూ మొదటి స్థానంలోనే నిలిచి 'కింగ్ ఆఫ్ ఎమోషనల్ సాంగ్స్' టైటిల్
- మూడవ నేషనల్ సింగింగ్ కాంపిటీషన్లో కూడా మొదటి స్థానంలో నిలిచారు.
- నాలుగవ నేషనల్ సింగింగ్ కాంపిటీషన్లో కూడా మొదటి స్థానంలో నిలిచి 'స్టార్ ఆఫ్ రొమాంటిక్ సాంగ్స్' ఇంటర్నేషనల్ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హత సాధించాడు.
భవిష్యత్తు ప్రణాళిక...
అజయ్ తన ప్రయాణం మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ఎన్ని అడ్డంకులు వచ్చిన పాటను మాత్రం వదిలిపెట్టకుండా ప్రముఖ గాయకులలో ఒకరిగా నిలవాలని ఆశిస్తున్నాను. అదే విధంగా జరగబోయే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కూడా విజేతగా నిలిచి విదేశాలలో కూడా తన పాటలను పరిచయం చేయాలని అనుకుంటున్నాను.
ఇటీవలే తిరునగరి శరత్ చంద్ర రాయగా అజయ్ పాడిన 'చూశాను నిన్ను నేను ఈ క్షణం' అనే పాట ఎంతోమంది శ్రోతల ఆదరాభిమానాలను పొందింది. త్వరలో 'అందాల చెలియా' అనే మరో సెన్సెషనల్ హిట్ సాంగ్ తో ముందుకు రాబోతున్నాడు. ఎఆర్ రెహమాన్ ప్రశంసలు అందుకుని అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ నటిస్తున్న చిత్రంలో రెండు పాటలు పాడే అవకాశాన్ని పోందాడు. లఘు చిత్రాలను కూడా తీస్తున్నాడు. రెండు తెలుగు సినిమాలకు మాటలు కూడా అందించనున్నాడు.
- అనంతోజు మోహన్‌కృష్ణ