Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వు నేను
ప్రేమ ప్రపంచం లో
స్వేచ్ఛా విహంగాలం
నువ్వు నేను
కాలం ఆడే ఆటలో
పావులుగా మారి..
తలో దిక్కు అయిపోయాం..
నువ్వు నేను...
మన మధ్య దూరాన్ని
చెరిపేస్తూ.. మనసుల
మద్య మమతల వారధి
నిర్మిస్తున్నాం..
నువ్వు నేను..
ప్రేమ కి అసలైన
నిర్వచనం తెలుసుకున్నాం
ప్రేమంటే ''కలిసి'' ఉండటమే కాదు
ప్రేమంటే రెండు హదయాలు
ఒక్కటిగా మారి స్పందించడం..
నువ్వు నేను...
ప్రేమలో మోహాలే కాదు
విరహ వేదనలు కూడా అని
గుర్తించాం..
నువ్వు నేను..
జీవిత రథ చక్రంలో
ఎంత ప్రయాణించిన
ప్రేమ బాటసారులమే..
- ప్రియాంక వజ్రాల
9948523883