Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలాన్ని కాగడగా చేసి ...
చీకటి బాగోతాల చేదిస్తారు
అక్షరాన్ని అస్త్రంగా మలిచి ..
అన్యాయలపై ఎక్కుపెడతారు
నేత్రాన్ని నిఘా కెమెరాగా ...
దుష్ట చేష్టల గుట్టు రట్టుచేస్తారు
నిబద్ధత వారి నైజం
నిజాయితీ వారి ఇజం
పారదర్శకత వారి వేదం
జన జాగతి వారి నినాదం
సత్య శోధన వారి లక్ష్యం
నిత్య వార్త ప్రసారం ధ్యేయం
వాళ్లే అక్షర సైనికులు
పత్రికా సుపుత్రులు
నిజాల నిగ్గు తేలుస్తారు
నిప్పులాంటి రాత రాస్తారు
ప్రమాదాలు, యుద్దాలు
విపత్తులు, వైపరీత్యాలు
సంఘటనలు ఏదైనా కానీ...
నిర్భీతిగా జనాలకు చేరవేస్తారు
బెదిరింపులకు తలొగ్గక...
భౌతిక దాడులకు వెరవక
వత్తి ధర్మం నెరవేరుస్తారు
విలువల దారిలో నడుస్తారు
సవాళ్ళకు దీటుగా బదులిస్తారు
అడ్డంకులు అలవోకగ చేదిస్తారు
సమాజానికి పెన్ను దన్నుగ నిలిచే
ఆ అక్షర సైనికులకు సలాములు
ఆ పాత్రికేయ ధీరులకు ప్రణతులు
- కోడిగూటి తిరుపతి
9573929493