Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్ష చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 'సొగసు చూడతరమా' అంటూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న తెలుగింటి కథానాయిక 'నక్షత్ర'. కథానాయికగానే మంచి సామాజిక సేవాభావంతో నిత్యం సమాజానికి తన వంతు చేయూతను అందిస్తున్న హైదరాబాదీ హీరోయిన్ నక్షత్ర తన అభిప్రాయాలన్ని నవతెలంగాణ జోష్ తో పంచుకున్నారు.
మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ?
నాన్న విష్ణు ప్రసాద్ రెడ్డి ( శ్రీజా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్), అమ్మ వేదా కుమారి రెడ్డి ( రిటైర్డ్ ఐఏఎస్ IA&AS), అన్నయ్య సాయి రాహుల్ ( జీవి కంపెనీస్ చైర్మన్). పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే,ఫ్యామిలి అంతా ఎడ్యుకేషన్ బ్యాక్రౌండ్ ఉండడం వలన నేను కూడా చదువులో ముందు ఉండేదాన్ని,మా అమ్మానాన్న ల సపోర్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళు వాళ్ల వర్క్స్ లో ఎంత బిజీగా ఉన్నా సరే మా విషయానికి వస్తే మాత్రం మాకు ఇవ్వాల్సిన ప్రేమ , టైమ్ ఇస్తూ మా ఇష్టాల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు. ఇంకా పోతే అన్నయ్య సాయి రాహుల్ మాత్రం చాలా మంచి వ్యక్తి ,ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు.నేను ఇంజనీరింగ్ వరకు స్టడీ చేసాను, బి.టెక్ అయ్యాక సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయ్యాను.
నటన వైపు రావాలని ఎందుకనిపించింది..?
ప్రతి ఒక్కరికి ఒక్క సారైనా సినిమా లో కనిపించాలనే కల ఉంటుంది, అలానే నా విషయానికి వస్తే మాత్రం చిన్నప్పటి నుండి నా అల్లరి, నేను చేసే పనులు చూసి ఇంట్లో వాళ్ళు సంతోష పడే వాళ్ళు, అలానే నన్ను కూడా సినిమా ద్వారా వెండితెరపై చూడాలని మా ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు, ఆ విధంగా సినిమా వైపు నా మనసు మళ్లింది. నటించండం అంటే నాకు ఫ్యాషన్.
మొదటి అవకాశం ఎలా వచ్చింది, ఫస్ట్ డే షూట్ అనుభవం ఎలా ఉంది?
నాని అని క్యాస్టింగ్ డైరెక్టర్ ఉండే వారు, నా పోర్ట్ ఫోలియో తనకు నచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో వివేకానంద విక్రాంత్ గారి డైరెక్షన్ చేస్తున్న ''దక్ష'' సినిమా లో నాకు మెయిన్ లీడ్ చాన్స్ రావడం జరిగింది. నాని కాస్టింగ్ లిస్ట్ లో ఉన్న నా ప్రొఫైల్ ''దక్ష'' టీం కి నచ్చడంతో నాకు ఛాన్స్ వచ్చింది. తర్వాత దక్ష కథ విన్నాను, నాకు చాలా నచ్చింది, సో నా మొదటి సినిమా ఇలాంటి డిఫరెంట్ కథతో ఉంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా జనవరి 7 , 2021 లో 1స్ట్ డే షఉట్ ఖమ్మం లో జరిగింది. దక్ష టీం తో అదే నా 1స్ట్ వర్కింగ్ డే,
మీకు ఎలాంటి పాత్రలు పోషించడం అంటే ఇష్టం..?
సినిమాలో హీరోయిన్ అంటే నాలుగు పాటలకి, ఒక రొమాంటిక్ సీన్స్ కో, లేదంటే అమ్మాయి ఉండాలి అనే ధోరణి మారాలి. నా విషయానికొస్తే నేను స్క్రీన్ మీద కనపడినప్పుడు నా కుటుంబం మరియు నన్ను అభిమానించే వాళ్ళు గర్వపడేలా నా పాత్ర ఉండాలి అనుకుంటాను. అలానే లేడి ఓరియెంటెడ్ మరియు కుంటుంబ కథ చిత్రాలలో నటించడం అంటే నాకు చాలా ఇష్టం.
నిజ జీవితానికి , సినిమా జీవితానికి తేడా..?
నిజ జీవితంలో ఊహించేవి, ఊహించనివి ఎన్నో ఎదుర్కొంటాం, కానీ సినిమా జీవితంలో మనకి ఏదైన కావాలి అంటే అది సన్నివేశానికి తగ్గట్లుగా మార్చుకోవచ్చు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలే సినిమాలో ఉంటాయి కానీ, సినిమా లో జరిగిన సన్నివేశాలు మాత్రం నిజ జీవితంలో ఉండవు.
మీరు చేసిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి చెబుతారా?
బేసిక్ గా ఒక చేతితో సహాయం చేస్తే ఇంకో చేతికి తెలియొద్దు అని మా పెద్దవాళ్ళు చెబుతుంటారు, మేము చేసే సోషల్ సర్వీస్ గురించి కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్పడం వలన సామాజిక సేవ చేయాలనుకునే వారు ఇంక ఎంతో మందికి సేవ చేసే ఆస్కారం వుంటుంది అని చెప్తున్నాను. నాకు, మా అన్నయ్య కి వచ్చే సంపాదనలో 25శాతం భాగాన్ని చదువు కోవాలని కోరిక ఉండి డబ్బులేక చదువుకోలేక పోతున్న విద్యార్థులకు ''గణ విద్య ఫౌండేషన్'' పేరు మీదుగా వాళ్లకి చదువుని అందిస్తున్నాం. మా సంస్థ ద్వారా ఇప్పటివరకు 70 మంది కి పైగా చిన్నారులకి గుండె , మెదడు ఆపరేషన్స్ చేపించడం జరిగింది.
ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల గురించి చెప్పండి..?
ఫిల్మ్ ఇండిస్టీలో నా జర్నీ ఇప్పుడిప్పుడే మొదలైనది, ఇందాక మీకు చెప్పినట్లు ''దక్ష'' సినిమా ద్వారా నేను హీరోయిన్ గా నా కెరియర్ ని స్టార్ట్ చేసాను. ఆ తర్వాత తల్లాడ సాయికష్ణ గారి డైరెక్షన్ లో ''సొగసు చూడ తరమా'' అనే సినిమా లో హీరోయిన్ గా చేస్తున్నాను, ఈ సినిమా అంతా అరకు చుట్టూ జరిగే ఒక అందమైన ప్రేమకథ చిత్రం,ఇంకో షెడ్యూల్ షూటింగ్ పెండింగ్ ఉంది. అలానే వినరు.వి.కే గారి డైరెక్షన్ లో ''మాటే రాని మౌనమిది'' సినిమాలో హీరోయిన్ గా చేసాను, ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ, త్వరలో విడుదల కి సిద్ధంగా ఉంది.
తెలుగు అమ్మాయిలకు సినీ పరిశ్రమ లో ఎలాంటి ప్రాధాన్యత ఉంది.?
టాలెంట్ ఉండి, యాక్టింగ్ పైన డెడికేషన్ ఉన్న ఏ అమ్మాయికి ఐనా ఫిల్మ్ ఇండిస్టీలో స్థానం ఉంటుంది. ఐనా ఒకప్పటి లా అమ్మాయిలు కామ్ గా లేరు,ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు, సో కెరియర్ అనేది మన చేతిలోనే ఉంది కష్ట పడితే ఏదేనా సాధించవచ్చు.
అటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, ఇటు సినీ రంగంలో ఉంటూ మీ సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారు..?
మా అమ్మగారు నాకు చిన్నప్పటి నుండే మనకు ఉన్న ప్రోగ్రామ్స్ ని టైమ్ కి తగ్గట్టుగా మల్చు కోవడం అలవాటు చేశారు. లైఫ్ లో ఖాళీ అనేది లేకుండా చూసు కుంటాను, టైమ్ కి చాలా వ్యాల్యూ ఇస్తాను, వర్క్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ అటు నా జాబ్ వర్క్స్ ,ఇటు ఫిల్మ్ వర్క్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటాను.
ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాల్లో మీరు బాధ పడిన లేదా సంతోష పడిన సంఘటనలు ఉన్నాయా..?
మనం చేసే ప్రతి పనిలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. అలానే సినిమా అంటే చాలా మంది టీం తో కలిసి వర్క్ చేసే పని. ఇక్కడ కష్టాలు, సంతోషాలు రెండు ఉంటాయి. ఇప్పటి వరకు నేను చేసిన దక్ష సినిమా షఉట్ లొకేషన్ లో చేజింగ్ సీన్స్ ఉండేవి, అందులో భాగంగా ఫారెస్ట్ లో జరుగుతున్నప్పుడు రన్నింగ్ లో స్లిప్ అయ్యి కిందపడి పోయాను, భయానికి ఫుల్గా ఏడ్చేశాను కానీ టీం మెంబర్స్ బాగా చూసుకున్నారు , ఆ నొప్పితోనే నేను షఉట్ చేసాను కానీ నాకు పెద్దగా ఇబ్బంది ఏం జరగలేదు. సొగసు చూడ తరమా సినిమా కటిక వాటర్ ఫాల్స్ దగ్గర షఉట్ అవుతున్నప్పడు హిల్స్ స్టేషన్ నుండి వెళ్ళాలి, కార్లు వెళ్లలేని రోడ్స్ , ఆటోస్ ద్వారా లొకేషన్ కి వెళ్ళాలి ,అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్లలో రాయి పై నుండి జారీ కాలు కి దెబ్బ తగిలించుకున్నాను కాని ఈ చిన్న చిన్న దెబ్బలు నాకు పెద్దగా బాధగా అనిపించలేదు, ఎందుకంటే మా టీం మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు, వాళ్లు చూపించే కేరింగ్ ముందు ఇవేవీ మాకు ఇబ్బందిగా అనిపించెవి కావు. మాటే రాని మౌనమిది సినిమా షూటింగ్ భీమవరం పరిసర ప్రాంతాల్లో జరినప్పుడు, అక్కడ కూడా బీచ్ లో పడిపోయాను. ఇంకా సంతోషమైన సంఘటనలు చాలా ఉన్నాయి, ఒక విధంగా చెప్పాలి అంటే బాధలు, సంతోషాలు రెండు మనం తీసుకునే విధానంలో ఉంటాయి.
ఇది నా జీవితంలో ఎంతో సంతోషానిచ్చిన సంఘటన అని మీరు ఎప్పుడు ఫీల్ అయ్యారు.?
2017 లో నా ఫ్యామిలీ తో చెన్నై, నాగపట్నం వెళ్లాం .ఆ ట్రిప్ కి మా ఫ్యామిలీ లో ఉన్న ప్రతీ ఒక్కరం అటెండ్ అయ్యాం,అక్కడ 5 రోజులు ఉన్నాం. నా లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్న సంఘటన అంటే ఇదే.
ఈ సెకండ్ వేవ్ కరోనా ప్రభావం సినీ పరిశ్రమ పై ఏ విధంగా ఉంది.?
సినీ పరిశ్రమలో మంచి పాత్రలు పోషిస్తూ మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి నటులకు, టెక్నీషియన్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం కానీ, చిన్న చిన్న పాత్రలు చేస్తూ, రోజు వారీ బేటాల ద్వారా డబ్బులు తీసుకునే నటి నటులకి, టెక్నీషియన్స్ కి మాత్రం ఈ కరోనా వలన చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది నా అభిప్రాయం.
మీకు వచ్చిన అవార్డ్స్ గురించి తెలియజేస్తారా ?
''గణ విద్య ఫౌండేషన్'' పేరిట మేము చేసిన సేవా కార్యక్రమాలని అభినందిస్తూ మేము తీసుకున్న మొదటి అవార్డు , మన దేశంలోనే గొప్ప విద్యావేత్త ''సేంట్ .మేరిస్ బ్రాండ్ ఓనర్ కే. వి.కే.రావ్ ''గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. ఇంకోటి సంధ్యవర్షిని మల్టీ మ్యూజికల్ ఆర్గనైజేషన్ తరుపున 2021 లో రెండు సార్లు అవార్డు అందుకున్నాను.
మీ భవిష్యత్తు ప్రణాళికలు, కార్యచరణ గురించి చెప్పండి..?
నేను కొనసాగుతున్న అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండేలా ,నాతో పాటు నన్ను నమ్ముకున్న కుటుంబాలకి మూడు పూటల అన్నం పెట్టడమే నా భవిష్యత్ కార్యాచరణ.
సినీ పరిశ్రమలో మీ రోల్ మోడల్ ఎవరు..?
మహానటి సావిత్రి గారు.
ఒకే రోజు సినిమా షఉటింగ్, అదే రోజు సామాజిక సేవా కార్యక్రమం ఉంటే , ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధన్యత ఇస్తారు..??
సినిమా కాల్షీట్లు మనకి అనుగుణంగా ఉండేలా మార్చుకోగలం, కానీ మనం చేయాలకున్న మంచి పని ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా ఉంది అన్నప్పుడు సామాజిక సేవా కార్యక్రమానికే నేను వెళ్తాను. ఉదాహరణకు ఒక్క రోజు షూటింగ్ వాయిదా వేసుకుంటే డబ్బు ,టైమ్ మాత్రమే లాస్ అవుతాము, కాని అదే సమయంలో మన బ్లడ్ గ్రూప్ కావలిసిన వ్యక్తికి రక్తం ఇవ్వడం వలన తన ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. కావున సామాజిక కార్యక్రమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను.
మీలాగా సినీ పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగు అమ్మాయిలకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?
పట్టుదల, పని మీద సామర్థ్యం ,నటించి ఆకట్టుకునే స్వభావం ఉండి, పాత్రలకోసం దేనికి తల వంచకుండా ఉంటే సినిమా పరిశ్రమ ఎప్పటికి తెలుగు అమ్మాయిలకి ఆహ్వానం పలుకుతుంది అని నా అభిప్రాయం..
- తేజస్వి