Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెలీ !
మొదట్లో సుదూరపు
నీలాకాశంలా
అందంగ కన్పించేదానివి !
అప్పుడు నీదోలోకం
నాదో ప్రపంచం
మనిద్దరిమధ్య ఊహకందని
ఈ మోహపు దారెట్ల పడ్దదో ఏమో ?!
మాట వరసకు
చీరలో బాగుంటావన్నందుకే
గడుసుగ గళ్ళగళ్ళ చీరకట్టి
నన్ను లీలగ నీ కొంగుకు
మొసమర్రకుంట కట్టిపడేసావు!
నా హదయాన్నో
ప్రణయాగ్ని పర్వతాన్ని చేసి
ప్రేమను లావాలా ఎగదోస్తూ
చుట్టూ జలపాతమై చుట్టి
ఊపిరాడకుండ చేస్తుంటావు !
ఏమీ ఎరగనట్టు ఎదలో..
విరహ మహాజ్వాలలు రగిలించి
రాత్రంత నిద్రాదేవి తిరస్కరించేట్లు చేస్తావు!
పిల్లా ..! ఏదయితేనేం తెల్లార్లూ
నీ కమ్మని కౌగిల్లోనే బంధిస్తావు కదా !!
- అశోక్ అవారి, 9000576581