Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాకబ్ తల్లిదండ్రులిద్దరూ మెట్రోపాలిటన్ ఆస్పత్రిలో వైద్యులు. రోజంతా కోవిడ్ రోగులకు సేవచేస్తూ సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారు. రాత్రంతా తీవ్రమైన గొంతునొప్పితో వారు బాధపడడం జాకబ్ గమనించాడు. విధి నిర్వహణలో భాగంగా ఎన్ 95 మాస్క్ ధరించిన వారు రోగులతో మాట్లాడేటప్పుడు గొంతు పెంచి మాట్లాడడం వల్లే ఇలా జరుగుతోందని గ్రహించిన అతడు ఈ అధునాతన మాస్క్‌ను తయారు చేశాడు. 8వ తరగతిలో తాను తయారు చేసిన 3డి ప్రింటర్‌ను ఈ రూపకల్పనకు ఉపయోగించాడు.
కోవిడ్ కారణంగా మన దైనందిన పనుల్లో మాస్కు ధరించడం తప్పనిసరైంది. అయితే మాస్క్ ధరించి ఇతరులతో మాట్లాడాలంటే చాలా అసౌకర్యంగా ఉంటోంది. దీంతో చాలామంది తమ మాటలను ఇతరులకు అర్థమయ్యేలా ఉండాలని మాస్క్ కిందికి లాగి మాట్లాడడం గమనిస్తూనే ఉన్నాం. ఇది మాస్క్ ధరించాలన్న ప్రాథమిక నిబంధనను ఉల్లంఘించడమే. పైగా వైరస్వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదముంది. ఈ అవాంతరాన్ని పోగొట్టాలని కేరళకు చెందిన ఓ విద్యార్థి మాస్క్ లోపల స్పీకర్లు ఉండేలా తయారు చేశాడు. వాటిని ధరించినప్పుడు మనం మాట్లాడే మాటలు ఇతరులకు చాలా స్పష్టంగా వినబడతాయి.
కేరళ త్రిసూర్‌కు చెందిన ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి కెవిన్ జాకబ్ అంతర్నిర్మిత స్పీకర్, యాంప్లిపైయర్ కలిగిన ఓ మాస్క్‌ను తయారు చేశాడు. జాకబ్ తల్లిదండ్రులిద్దరూ మెట్రోపాలిటన్ ఆస్పత్రిలో వైద్యులు. రోజంతా కోవిడ్ రోగులకు సేవచేస్తూ సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారు. రాత్రంతా తీవ్రమైన గొంతునొప్పితో వారు బాధపడడం జాకబ్ గమనించాడు. విధి నిర్వహణలో భాగంగా ఎన్ 95 మాస్క్ ధరించిన వారు రోగులతో మాట్లాడేటప్పుడు గొంతు పెంచి మాట్లాడడం వల్లే ఇలా జరుగుతోందని గ్రహించిన అతడు ఈ అధునాతన మాస్క్‌ను తయారు చేశాడు. 8వ తరగతిలో తాను తయారు చేసిన 3డి ప్రింటర్‌ను ఈ రూపకల్పనకు ఉపయోగించాడు.
గతేడాది అక్టోబరులోనే ప్రొటోటైప్ మాస్క్‌లో స్పీకర్స్‌ను అనుసంధానం చేశాడు. అందులోని ఆంప్లిఫై యూజర్స్ మాస్క్ ధరించిన వ్యక్తి మాటలను పెద్దవి చేసి అవతలి వ్యక్తికి వినిపిస్తుంది. దీనివల్ల గొంతుపై ఎటువంటి అదనపు భారం పడదు.త్రిసూర్ ప్రభుత్వ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న జాకబ్ జూన్ 2020లోనే ఈ స్పీకర్ మాస్క్ గురించి తెలుసుకున్నాడు. అయితే అది సామాన్యులు భరించలేని ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల చాలా తక్కువ మొత్తంలో తయారయ్యే మాస్క్ ముందుగా తన తల్లిదండ్రుల కోసం తయారుచేయాలనుకున్నాడు. ఆన్లైన్ ద్వారా మైక్‌లు, స్పీకర్ల గురించి సమాచారాన్ని సేకరించాడు. అవన్నీ కూడా మాస్క్‌లో ఇమిడేంత సైజుకు భారీగా ఖర్చుతో కూడుకున్నవే. అందుకే..తన 3 డి ప్రింటర్‌ను తన సొంత మాస్క్ తయారీకి ఉపయోగించాడు. కొన్ని ప్రయోగాలు విఫలమైనా తన ప్రయత్నాన్ని ఆపలేదు. చివరకు 6.3 సెంటిమీటర్ల పొడవుతో 3 సెం.మీ వెడల్పుతో 0.5 సెం.మీ మందంతో మాస్క్ తయారుచేశాడు. 45 నిమిషాలు చార్జింగ్ చేస్తే రోజంతా ఉపయోగపడుతోంది. సూక్ష్మ సైజులో ఉన్న ఈ స్పీకరును ఫేస్ షీల్డుకు అమర్చుకునేలా కూడా రూపొందించాడు.
జాకబ్ తయారుచేసిన ఈ స్పీకర్ మాస్క్‌ను అతని తల్లిదండ్రులు రోజూ ఆస్పత్రికి పెట్టుకెళ్తున్నారు. తమలాగే ఇతర ఆస్పత్రుల్లో పనిచేస్తున్న తమ మిత్రులకూ వీటిని పంపిస్తున్నారు. ఈ వార్త ప్రజాబాహుళ్యంలోకి వెళ్లడం ఆలస్యం జాకబ్‌కు ఆర్డర్లు వెల్లువలా వస్తున్నాయి. తిరువనంతపురం, కోజికోడ్లతో పాటు ఇతర నగరాల్లో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం స్పీకర్ మాస్క్‌లు తయారు చేయాలని ఆర్డర్లు వస్తున్నాయి.
ఈ ఏడాది జనవరిలో ఈ కొత్త రూపకల్పన 'దర్శన ఇగ్నైట్'లో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది. ప్రస్తుతం జాకబ్ తన అధ్యయనాలపై మరింతగా దష్టి పెట్టాలనుకుంటున్నాడు. దీంతో ఎక్కువ పరికరాలను తయారుచేసేందుకు సిద్ధంగా లేడు. సాంకేతిక పరిజ్ఞానంలో విశేష ప్రతిభగలవారెవరైనా తన ప్రాజెక్టుపై శ్రద్ధ చూపిస్తే తన అధ్యయన పరిజ్ఞానాన్ని వారికి బదిలీ చేస్తానంటున్నాడు.