Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఫార్మా కంపెనీ నెల కొల్పాలని ఆశయంతో ప్రస్తుతం ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సమాజం కేవలం వ్యాక్సిన్స్ మరియు మెడిసిన్స్ మీదనే నడు స్తుంది. కావున చాలా మంది ప్రజలకి ఇంకా సేవా చేస్తూ, యువతకి ఉపాధి కల్పిస్తూ నేను అనుకున్న రంగంలో మొదటిస్థానంలో ఉండాలని అనేది నా ఆశ. అందు కోసమే ఇంకా కష్టపడు తున్నాను, ప్రతి రంగంలో శ్రమ ఉంటుంది, కష్ట నష్టాలు రెండు ఉంటాయి. అన్నింటిని ఎదు ర్కొంటూ, మనం అనుకున్న పనిని దైర్యంగా ముందుకు వెళ్తేనే మన విజయానికి ప్రతిఫలం ఉంటుంది. అమ్మనాన్నల ఆశీస్సులు, అన్నయ్యల ప్రోత్సహం, టీం సపోర్ట్ తో ముందుకు
వెళ్తున్నాను.
నా పేరు గంట హరీష్, మాది మధ్యతరగతి కుంటుంబం. నాన్న స్వామి దాసు ఆర్ధిక ఇబ్బందులతో ఇంటర్ తోనే ఆపేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. నాన్న పడిన కష్టాలు మేం పడకూడదని తాను కష్టపడి మమ్మల్ని ఇష్టంగా చదివించారు. అన్నింటిలోనూ నాన్నకి తోడుగా, మా కుటుంబానికి వెన్నుముకలా నిలిచింది మా అమ్మ. మా అమ్మ పంచే ప్రేమ, ఇచ్చే భరోసా, కష్టపడే తత్వమే మాకు మార్గదర్శం. అమ్మ అందించిన ప్రోత్సహంతోనే మా ఇద్దరు అన్నయ్యలు రాములు, గణేష్ గవర్నమెంట్ టీచర్లుగా ఉద్యోగం సాధించారు. చెల్లి దివ్య కూడా అదే దారిలో ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి డాక్టర్ అవ్వాలి ఆశ. ఆశ అయితే ఉంది కానీ ఎంబీబీఎస్ చేయించే ఆర్థిక స్తోమత లేదు. నా చదువు కోసం అమ్మానాన్నలను అప్పుల ఊబిలోకి నెట్టకూడదని మొక్కలోనే నా ఆశను తుంచివేశాను. పెద్దముప్పారం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి సాయిరాం జూనియర్ కాలేజ్ లో నాకు ఎంతో ఇష్టమైన బైపీసి దంతాలపల్లిలో ప్రధమ శ్రేణి సాధించాను. ఆ తర్వాత పాలమూరు యూని వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, కర్నూల్ రాయలసీమ యూనివర్సిటీలో బి.ఎడ్, నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాను.
మెడికల్ ఫీల్డ్ అంటేనే మక్కువ
చిన్న నాటి నుండి డాక్టర్ అవ్వాలని కోరిక తీరక పోవడంతో మెడికల్ ఫీల్డ్ తోనైనా ఆశ తీర్చుకున్నాను. ఎలాగైన సరే నేను మెడికల్ ఫీల్డ్ లో ఉంటూ సేవ చేయాలి అనుకున్నాను. ఇంటర్ లో కూడా బై.పి.సి కోర్స్ తీసుకొని ఆ సంవత్సరం నుండి మొదలు పెడితే 2018 వరకు మెడికల్ మీదనే నా స్టడీస్ ని కొనసాగించాను. ఫార్మా రంగం పైన పూర్తి అవగాహనకు వచ్చాను.
డాక్టర్‌కి ఈక్వల్‌గా ఉండేది కేవలం
ఫార్మసీస్ట్ మాత్రమే..
నాలో ఉన్న డాక్టర్ అనే ఆశ, ఆ ఆశ సక్సెస్ ఐతే ఏదొక రకమైన వైద్యానికే పరిమితం అవ్వాలి. అదే ఫార్మసీస్ట్ ఐతే ఎన్నో రకాల మందులని కనిపెట్టవచ్చు. అన్ని రకాల జబ్బులకు మందులు ఏం ఏం వాడాలో తెలుసుకోవచ్చు, ఇలా డాక్టర్ కి ఈక్వల్ గా సొసైటీ లో సేవా చేసేది ఒక ఫార్మసీస్ట్ మాత్రమే, ఇంకా నా మనసు అంతా ఫార్మా రంగం వైపు మళ్లింది.
మెడికల్ రిప్ గా నా జర్నీ మొదలు..
హైదరాబాద్ల్ పల్స్ ఫార్మా కంపెనీ నందు మెడికల్ రిప్‌గా 2018లో చేసాను. అప్పటి వరకు మెడికల్ ఫీల్డ్ అంటే సేవా మార్గం అనుకునే నేను అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూసి నాలో నేను చాలా బాధ పడే వాడిని .కొందరు నిజాయితీగా ఉండకపోవడం నాకు నచ్చేది కాదు. ఇదంతా చూసి నేను తట్టుకోలేకపోయాను, ఆ క్షణం నాలో నేను ఫిక్స్ అయ్యాను నేను ఒక పది మందికి ఉపాధిని ఇస్తూ, సొంతంగా ఫార్మా బిజినెస్ చేస్తూ నిజాయితీగా ఉండాలని అనుకున్నాను. మూడు సంవత్సరాలు 2018 నుండి 2020 వరకు నేను సూటిపోటి మాటలు ఎదుర్కుంటూ నా ఫ్యూచర్ ప్లాన్స్ నేను వేసుకునే వాడ్ని .కొంతమంది అనే వారు నీకు ఎందుకురా అవ్వన్నీ, కామ్ గా ఏదేనా జాబ్ చేసుకో అనే వాళ్లు, నేను రైతు బిడ్డనే, నాకు వ్యవసాయం మీద అవగాహన ఉంది కాని, అందులో ఇప్పుడు అభివద్ధి లేదు, మన స్థానం మారాలి మనం చేసే పని ఒక పది మందికి ఉపాధికి ఇచ్చేలా ఉండాలని నా ఆశయం కోసం ప్రయత్నం ఆపలేదు.
గోపినాథ్ మెడికల్ ఏజెన్సీస్
ఫార్మ రంగంలో పి.జీ చేశాను. మెడికల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో 2021 మార్చ్ 1న మహబూబాద్ జిల్లా, తొర్రుర్ మండలంలో గోపినాథ్ మెడికల్ ఏజెన్సీస్ని స్థాపించాను. ఇది పెట్టడానికి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏజెన్సీ పెట్టాలి అంటే ముందు డబ్బులు ఉండాలి. అందు కోసం పొలం అమ్మి డబ్బు సర్దుబాటు చేశారు నాన్న. మెడికల్ ఫీల్డ్ అంటేనే ఇంటర్నల్ మాఫియా రన్ అయ్యే ఫీల్డ్ అని తెలుసు, అలాంటిది ఎలాంటి సర్కిల్ లేని నాకు ఫార్మా రంగంలో మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ అనుమతులు పొందాలి అంటే సాధ్యమవుతుందా అనుకునే వాడ్ని, కానీ నా నిజాయితీ నాకు తోడుగా నిలబడింది. అనుకున్న టైమ్ లోనే డ్రగ్ లైసెన్స్ పర్మిషన్ రావడం, అందరి సహకారం ఉండడం, మంచి టీం దొరకడం తో మార్చ్ 1న 2021న గోపీనాథ్ మెడికల్ ఏజెన్సీస్ ని స్థాపించాను.
కరోనా టైమ్‌లో మెడిసిన్స్ అందిస్తున్నందుకు గర్వపడుతున్నాను...
కొంతమంది కరోనా టైమ్‌లో మెడికల్ ఫీల్డ్‌ని తిట్టుకునేలా చేస్తున్నారు, ఉదాహరణకు ఈ కరోనా సెకండ్ వేవ్ సీజన్లో రేమిడిస్వేర్, టోసిలీజంబ్ లాంటి మెడిసిన్స్‌ని బ్లాక్ మార్కెట్ ద్వారా దారి మల్లిస్తూ సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. మా గోపీనాథ్ మెడికల్ ఏజెన్సీ తరుపున మాత్రం మెడికల్ షాపులకి, హాస్పిటల్స్‌కి ఇన్ టైమ్‌లో ఇస్తూ సరైన ధరకు వాళ్ళందరికి అందుబాటులో సర్వీస్ చేస్తు న్నాను. మా టీం తరుపున కరోనా టైమ్ లో చాలా మందికి మావంతుగా మాస్కులు, శానిటైజర్లు అందించాము.
ఒక ఫార్మా కంపెనీ నెలకొల్పాలని ఆశయంతో ప్రస్తుతం ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సమాజం కేవలం వ్యాక్సిన్స్ మరియు మెడిసిన్స్ మీదనే నడుస్తుంది. కావున చాలా మంది ప్రజలకి ఇంకా సేవా చేస్తూ, యువతకి ఉపాధి కల్పిస్తూ నేను అనుకున్న రంగంలో మొదటిస్థానంలో ఉండాలని అనేది నా ఆశ.అందుకోసమే ఇంకా కష్టపడుతున్నాను, ప్రతి రంగంలో శ్రమ ఉంటుంది, కష్ట నష్టాలు రెండు ఉంటాయి. అన్నింటిని ఎదుర్కొంటూ, మనం అనుకున్న పనిని దైర్యంగా ముందుకు వెళ్తేనే మన విజయానికి ప్రతిఫలం ఉంటుంది. అమ్మనాన్నల ఆశీస్సులు, అన్నయ్యల ప్రోత్సహం, టీం సపోర్ట్ తో ముందుకు వెళ్తున్నాను.
- జోష్ డెస్క్