Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనులైన తెరెవలేనే,
నీవు కనబడకపోతే,
అడుగైనా వేయలేనే,
నీ అడుగు జాడలేనిదే,
నా నీడైనా జాడలేకపోయెనే,
నీ జాడకై నే వెతుకుతుంటే,
నీ నా పరిచయమే,
అది నాకొక పరవశమే,
నీ ముసి ముసి నవ్వులే,
నాకేమో అది హరివిల్లే,
నీలో నిండిపోయిన భావనే,
నా గుండె చప్పుడని చెప్పనా,
నీ వెనకే నేనుండనా,
నీ నీడనై నిను కాపాడనా,
నిను చూసిన ప్రతిక్షణం,
నను నే మరచిపోయానే,
ఓ మౌనమా,
ఇకనైనా మాట్లాడవా,
ఏదేమైనా ప్రియతమా,
నను వీడి నీవెళ్ళినా,
నీ తోడై ఏప్పటికి నే ఉంటా...
- రాంచరణ్.వి