Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్దుతాడు'' అంటాడు రైతు గురించి ఒకచోట తండ హరీష్ గౌడ్. కవిత్వంలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని ముందుకెళ్తున్న యువకవి .ప్రతి వాక్యాన్నీ కవిత్వం చేయాలన్న గాఢమైన తపన హరీష్ ది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు ఆయన స్వగ్రామం. కవిత్వంలో భాగంగా ఇప్పటికి రెండు కవితా సంపు టాలను వెలు వరించాడు. ఉపాధ్యా యుడిగా కొనసాగు తున్నా కవిత్వం ఆయన నిరంతర శ్వాస. ఆయనతో ఈ వారం పరిశోధకుడు నర్రా ప్రవీణ్ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ పాఠకులకు ప్రత్యేకం....
1. మీ మొదటి కవితా సంపుటి 'నీటిదీపం' లో బఠానీలవ్వ, రొట్టెలమ్మలు లాంటి కవితలు ఎంతోమందిని ఆకర్షించాయి. మీ మాటల్లో ఆ సంపుటి గురించి?
ఈ రెండు కవితలు నా జీవితా నుభ వంలోనివి.ఒక కవిత పాఠశా లలో బఠానీలమ్మే అవ్వను చూసి రాసినది.రెండవది నేను హైదరా బాద్ లో ఉన్నప్పుడు సాయంత్రం పూట జొన్నరొట్టెలు కొన్న సందర్భంలో వాళ్ళ జీవితాన్ని చూసి చలించి రాసినది. కవిత్వానికి వాస్తవిక జీవితం తోడ యింది కాబట్టి ఈ కవితలు నిలిచి పోయాయన్న అభిప్రాయం నాకుంది.ఇవే కాకుండా ఆకర్షించే కవితలు ఈ కవితా సంపుటిలో ఇంకా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 'నీటిదీపం' సంపుటి 'వస్తువైవిధ్యత' కల్గినది. సామాన్యుల జీవితాలకు ఓ ప్రతిబింబం.
2. మీ కవిత్వంలో తెలంగాణ భాషాభివ్యక్తి స్వల్పంగా ఉంది? కారణం?
వస్తువును బట్టే నా కవితా నిర్వహణ ఉంటుంది. అందులో డైఎలక్ట్ ఉండాలా? ప్రామాణిక భాష వాడాలా అనేవి అదే నిర్ణయిస్తుంది. నా రెండవ కవితాసంపుటి 'ఇన్ బాక్స్'లో తెలంగాణ భాషాభివ్యక్తికి సంబంధించిన కవితలున్నాయి. ఈ మధ్యకాలంలో రాసే కవిత్వంలో తెలంగాణభాషను విరివిగా వాడుతున్నాను.
3. సాంకేతిక పదమైన 'INBOX' ను మీ పుస్తకానికి శీర్షికగా పెట్టుకున్నారు కదా? అందులోని ఆంతర్యం ఏమిటి?
ఇది కవి హదయసంవేదనల 'INBOX' ఇది సామాజి కాన్ని, వైయుక్తికాన్ని కలగలిపిన సందేశాలను పంచుతుంది. ఇంగ్లీష్ శీర్షికలు గతంలో కూడా చాలా పుస్తకాలకు పెట్టారు. ఈ శీర్షిక ప్రత్యేకత ఏంటంటే మొత్తం సంపుటికి సంబంధించిన సారాన్ని స్ఫురింపచేస్తుంది. ఇది ప్రజల నోళ్ళలో నలిగిన పదం కదా తొందరగా ఆకట్టుకుంటుంది.
4. పాతతరం కవులను,కొత్తతరం కవులను మీ ఆధునికాభివ్యక్తి పోకడ మెప్పిస్తుందా?
మెప్పిస్తుంది. కవి చలనశీలి. కాలంతో పాటు అభివ్యక్తిలో ముందంజ వేయాలి.లేకుంటే కవిగా రాణించలేడు. కొత్తతరమైనా, పాతతరమైనా ఓ మూసలో ఒదిగిపోయిన కవిని మెప్పించడం ఎవరితరం కాదు. పాతతరం కవులలో కూడా కాలంతో పాటు పరిగెత్తే కవులున్నారు.అభివ్యక్తి పరంగా వాడిన ప్రతీకలను మళ్లీ మళ్లీ వాడకుండా కొత్తదనాన్ని చూపించాలన్నది నా అభిమతం.
5.మీ కవితా దక్పథం ఏమిటి?
సామాజికమైనా, భావుకతైనా ఎన్నయినా, ఏ వాద మయిన అందులో కవిత్వం పాళ్ళు లేకపోతే వ్యర్థమే కదా. అందుకే నేనం టాను కవిత్వమే నా దక్పథమని. కవి తాశిల్ప నిర్వహణ లో పరిణతి చెందిన కవి ఏ అంశాన్నయినా సులువుగా కవిత్వం చేస్తాడు. నా అడు గులు కూడా ఆ వైపే.
- నర్రా ప్రవీణ్ రెడ్డి
తెలుగు సాహిత్య పరిశోధకులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం
సెల్: 9393636405.