Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా పేరు భోగరాజు శోభన్ బాబు. నాన్న మల్లయ్య ఎన్.ఎస్.పీ క్యాంప్ లో డిపార్ట్మెంట్ వాచ్ మెన్ గా పనిచేసేవారు. అమ్మ వెంకమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. మాది మధ్య తరగతి కుటుంబం. మా అమ్మానాన్నలకు హీరో ''శోభన్ బాబు '' అంటే చాలా ఇష్టం. దీంతో ఇంట్లో చిన్నవాడ్ని అయిన నాకు ఈ పేరు పెట్టారు. మా స్వస్థలం సూర్యాపేట జిల్లాలో మహమ్మదాపురం (సైదాబాద్ గూడెం ) నాన్న ఉద్యోగ రీత్యా నడిగూడెం లో ఉన్నప్పుడు నేను పుట్టాడట నేను ఆరు నెలల బాబు గా ఉన్నప్పుడు ఖమ్మం ఎం ఎస్ పీ కాలనీ కి మాకాం మార్చారు. దీంతో ఎన్.ఎస్.పీ క్యాంప్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పదో తరగతి వరకు చదివాను. వివేకానంద కాలేజీలో ఇంటర్, ఖమ్మం ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్ కాలేజిలో బీకాం పూర్తి చేశాను.
చిన్నతనంలోనే పాటలు పాడే అలవాటు ఉన్నా.. ఎప్పుడూ వేదికలు ఎక్కలేదు. బాత్రూమ్ సింగర్‌గా మిగిలి పోయేవాడ్ని. కానీ ఇంటర్ ఫస్టియర్‌లో మొదటిసారిగా పాటల పోటీలలో పాడి అభినందనలు అందుకున్నాను. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఖమ్మం ఎన్ ఎస్ పీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు కులమతలకు ఆతీతంగా అందరం కలిసి ఆనందంగా సంబరంగా జరుపుకునే వాళ్ళం. ఆ వినాయక చవితి మండపాలలో నేను పాటలు పాడే వాడిని అంత్యాక్షరీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే వాడిని చిన్నచిన్న నాటికలు కూడా వేసేవాడ్ని. అదే ఈ రోజు నన్ను నటుడిగా, గాయకుడిగా నిలబెట్టింది.
డిగ్రీ చదివే రోజుల్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మంత్రి కిషన్ సారథ్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా అటు సేవాకార్యక్రమాలలో, ఇటు సాంస్కతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే వాడిని. అప్పుడే ఒక ఏడాది పాటు సంగీతం కూడా నేర్చుకున్నాను. డిగ్రీ చదివే రోజుల్లో కాలేజీలో పాటలు పోటీలతో పాటుగా ఖమ్మం చుట్టుపక్కల కూడా పాటల పోటీలు జరుగుతున్నాయి అని పిలిస్తే చాలు వెంటనే వెళ్లి ఉత్సాహంగా పాల్గొంటం అలవాటుగా మారింది. ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా మిమిక్రీ క్యాసెట్లు వినేవాడిని ఒకసారి మా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలో కాలేజ్ డే సందర్భంగా పాటల పోటీ, మిమిక్రీ పోటీలల్లో పాల్గోన్నాను. పాటల పోటీలో రెండవ ప్రైజు ,మిమిక్రీ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు నాకు ఒక నమ్మకం కలిగింది నేను పాటల తో పాటుగా మిమిక్రీ కూడా చేయగలను అని , డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదివే రోజుల్లో విజయవాడ సిద్ధార్థ అకా డమీ వారు నిర్వహించిన యువజనోత్సవాల లో నేను నటించిన ''పిచ్చి పెళ్ళికొడుకు'' నాటికలో నేను వేసిన పిచ్చికి పెళ్ళికొడుకు వేషధారణలో నా నటనకు జడ్జీలను అదేవిధంగా విద్యార్థులను కడుపుబ్బ నవ్వించింది. ఆ నాటికకు ద్వితీయ బహుమతి దర్శకులు బి.గోపాల్ గారి చేతుల మీదగా అనుకున్నాం.
2005 నల్గొండ జిల్లా బేతవోలు కొండాపురం డాన్స్ పోటీల్లో ప్రథమ స్థానం. 2006 వరంగల్‌లో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు మిమిక్రీ విభాగంలో తతీయ బహుమతి, పాటలు నాటికలు మిమిక్రీ డాన్స్ లలో సుమారుగా 200కు పైగా బహుమతులు, అఖిల్ డాన్స్ స్కూల్, శ్రీ రాఘవేంద్ర డాన్స్ అకాడమీ, ఏబిసిడి డాన్స్ అకాడమీలో యాంకర్‌గా సుమారుగా పది సంవత్సరాలు చేశాను. ఖమ్మం లోకల్ చానల్స్ ( మారుతి ప్లస్,సీ ఛానల్ ) 'ఖమ్మం మల్లన్న'గా జానపద గీతాల కార్యక్రమానికి యాంకర్ గా పని చేశాను. 'డ్యాన్స్ అనుకరణ' చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కష్ణ, బ్రహ్మానందం, ఆర్ నారాయణ మూర్తి, రాజశేఖర్ లాగా రకరకాల డాన్సులు చేయగలను.
లఘు చిత్రాలు
సుమారుగా 110 లఘు చిత్రాలలో నటించాను. 'స్మార్ట్ పోలీస్' అప్పటి హౌం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి నుంచి అవార్డు అందుకున్నాను. 'చలనం' లఘు చిత్రానికి కరీంనగర్ లో ద్వితీయ బహుమతి అందుకు న్నాను. 'మన ఊరు -మన ప్రణాళిక' , 'సంకల్పం' లఘు చిత్రాలకు హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా బహుమతులు అందుకున్నాను. 'దానం' లఘు చిత్రానికి విజయవాడ, వైజాగ్ లో 'మనోగతం' లఘు చిత్రానికి భారత ఉపరాష్ట్రపతి 'వెంకయ్య నాయుడు' చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్ని అందించింది.
'నిన్ను చేరి' వెబ్ సిరీస్‌లో గౌతమ్ రాజు, కిషోర్ దాస్, కమెడియన్ భద్రం, జబర్దస్త్ శాంతి స్వరూప్‌తో కలిసి విలన్ గా నటించాను. సుమారుగా పది 'సినిమా'లలో నటించాను. 'ఒక్కడితో మొదలైంది' సినిమాలో హీరో 'సుమన్' పక్కన నటించాను. 'ఎందరో మహానుభావులు', 'బ్లాక్ బోర్డు' చిత్రాలలో నటించాను, 'గోర్ జీవన్ (స్వేచ్ఛ)' చిత్రంలో 'మంగ్లీ'తో కలిసి నటించాను.
ఇప్పటివరకు లఘు చిత్రాలలో రైతుగా, పోలీసుగా, బిచ్చగాడిగా, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ వస్తున్నాను. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇటువంటి మంచి లఘు చిత్రాలలో నటించాలని అనేది నా కోరిక , నాకు ఇప్పటివరకు అవకాశాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న లఘు చిత్ర దర్శకులు అందరికీ నా ధన్యవాదాలు కనీసం ఒక వెయ్యి లఘు చిత్రాలలో నటించాలని నా కోరిక , సినీరంగంలో తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజు, రావు రమేష్ వంటి ఉత్తమ నటుల నటనంటే నాకు చాలా ఇష్టం. సినీ రంగంలో ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి అనేది నా కోరిక.
నేను వత్తిపరంగా ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ సుమారు పది సంవత్సరాలు డాన్స్ ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేసిన తరువాత దష్టి నటన వైపు మళ్ళింది. ఒకసారి కొత్తగూడెం రేడియో స్టేషన్ కు వెళ్లి మిమిక్రీ కూడా చేసి వచ్చాను. ఆ తరువాత ఖమ్మంలో ఈటీవీలో ప్రసారమయ్యే నేరాలు-ఘోరాలు ప్రోగ్రాం ఎపిసోడ్ షఉటింగ్ ఖమ్మం లో జరుగుతుంది. ఆ ప్రోగ్రాం డైరెక్టర్ తులసి గిరి బాపూజీ వారు నాకు ''జులాయి ,''కత్తుల సమ్మయ్య '' లాంటి కొన్ని ఎపిసోడ్స్ లో చిన్న చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. నన్ను నేను టీవీలో చూసుకొని చాలా మురిసిపోయాను.
హైదరాబాద్ వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయాలి అనుకున్నాను. అప్పుటికి సినీరంగంలో నాకు పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలిసిన తమ్ముడు కట్టంగూర్ ఉపేందర్ రూమ్ లో ఉండి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వాడిని కొంతమంది సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు కానీ అవకాశాలు ఇప్పించ లేదు.
నాతో పాటు ఖమ్మంలో డాన్స్ ఇనిస్ట్యూట్ నడిపిన తమ్ముడు రాఘవ హైదరాబాదులో స్థిరపడ్డాడు అమీర్‌పేటలో తను డాన్స్ ఇన్స్ ట్యూట్ నడిపేవాడు. అప్పుడప్పుడూ తన దగ్గర కూడా ఉండే వాడిని నాకు హైదరాబాదులో ఏరియాలు సరిగ్గా తెలియక పోవడం వలన తనను దగ్గరుండి సినిమా ఆఫీసులకి ఆడిషన్స్‌కి నన్ను తీసుకెళ్ళాడు.
2010వ సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. సూర్యాపేట జిల్లా పొట్ల పహాడ్ గ్రామానికి చెందిన జిల్లా పల్లి సైదులు - లక్ష్మీ దంపతుల కూతురు ''స్వప్న'' తో వివాహం జరిగింది. నాకు ఇద్దరు కుమారులు పెద్ద బాబు విశ్వతేజ నాలుగవ తరగతి చదువుతున్నాడు. ఇప్పటి వరకు సుమారుగా 20 లఘు చిత్రాలలో నటించాడు. 'సంకల్పం', 'బాధ్యత' లఘు చిత్రాలలో నాతో పాటు కలిసి నటించాడు. చిన్న బాబు పేరు ఉదరు రుద్ర తేజ రెండవ తరగతి చదువుతున్నాడు. ఇప్పటి వరకు సుమారుగా 15 లఘు చిత్రాలలో నటించాడు. ''మార్పు'', ''ప్లాస్టిక్ వాడొద్దు'' లఘు చిత్రాలలో నాతో పాటు కలిసి నటించాడు. చాలా మంది నన్ను 'నీకు నీకు పెళ్లి అయింది. పిల్లలు ఉన్నారు. ఈ వయసులో సినిమా ప్రయ త్నాలు అవసరమా అని' హేళన చేసేవారు. అయినా నేను నిరుత్సాహపడలేదు. వెనుకాడ లేదు. మొదట్లో నేను ఖమ్మంలో కొంతమంది లఘుచిత్ర దర్శకులను నటించే అవకాశం అడిగాను కానీ ఫలితం లేకపోయింది. కొంతకాలానికి నా ప్రయత్నం వధా పోలేదు సుమారుగా ఒక పదిహేను లఘు చిత్రాల్లో నటించిన తర్వాత తల్లాడ సాయి కష్ణ( దర్శకుడు, హీరో) పరిచయమయ్యాడు. తను డైరెక్షన్ చేసిన సుమారు 20 ఏళ్ళ చిత్రాలలో నేను నటించాను. తన డైరెక్షన్ చేసిన మనోగతం షార్ట్ ఫిలింకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ తరువాత తల్లాడ సాయి కష్ణ డైరెక్షన్ చేసిన ఎందరో మహానుభావులు సినిమాలో నాకు సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా నటించే అవకాశం వచ్చింది. తన డైరెక్షన్ చేసిన 'బ్లాక్ బోర్డ్', 'నమస్తే సేట్ జీ' సినిమాలో కూడా అవకాశం దక్కింది. ప్రస్తుతం వివేకానందా విక్రాంత్ గారు డైరెక్షన్ చేస్తున్న దీక్ష 32 సినిమాలో అవకాశం వచ్చింది.
నేను వత్తిరీత్యా ఎల్ఐసి ఏజెంట్ ని వత్తి కన్నా ప్రవత్తి అయినటువంటి కళారంగానికి ఎక్కువ టైం కేటాయించే వాడిని, ఇప్పటివరకు సుమారు 110 లఘు చిత్రాలలో నటించాను. ఖమ్మంలో నన్ను ''ఖమ్మం మల్లన్న'' అని కొందరు, ''ఖమ్మం కమల్ హాసన్'' అని కొందరు, నేచురల్ స్టార్ అని కొందరు పిలిచేవారు. నాకు చాలా ఆనందం కలిగేది, మేము తీసిన లఘు చిత్రాలకు బహుమతులు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. అలాగే షూటింగుల్లో ఇబ్బందులు కూడా ఉండేవి లఘు చిత్ర ్లదర్శకులు తను ఎంచుకున్న కథను బట్టి ఆ చిత్రానికి అయ్యే బడ్జెట్ కోసం నిర్మాతలు చూసుకొని లఘు చిత్రాలు తీసేవారు. కొన్ని సందర్భాలలో నిర్మాతలు దొరకక దర్శకులు సొంతంగా ఆ షార్ట్ ఫిలింకి అయ్యే ఖర్చు భరించేవారు అందువల్ల నటులమైన మాకు పారితోషికం ఇవ్వలేకపోయారు. ఒక్కోసారి చుట్టుపక్కల ఊర్లో షూటింగ్‌లకు వెళ్ళినప్పుడు ఖర్చులు కూడా మేమే భరించాల్సి వచ్చేది. కొన్ని సందర్భాలలో టైమ్ కి భోజనం కూడా అందుబాటులో ఉండేది కాదు అయినా సినిమా మీద ఉన్నటువంటి ఇష్టం కొద్దీ ఇబ్బందులన్నీ భరించేవాళ్ళం. నాతో పాటు చదువుకున్న మిత్రులు అందరూ రకరకాల ఉద్యోగాలు, రకరకాల వత్తుల్లో, వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. వాళ్ళను చూసినప్పుడు నేను ఆర్థికంగా సెటిల్ కాలేకపోయానే అని కొంచెం బాధగా కూడా ఉంటుంది. పిల్లలు ఎదుగుతున్నారు చదువులు మిగతా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి నేను కుటుంబ పరంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటునే సినిమా బాటలో నడుస్తున్నాను. సంవత్సరానికి పైగా ప్రస్తుతం కకరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది.
ఈ కరోనా టైంలో అందరితో పాటు నాకు కూడా ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి ''కళాకారుడి జీవితం కాగితం పువ్వు లాంటిది వాసన రాదు వాడిపోదు'' అన్నట్లుగా నేను నమ్ము కున్న సినిమా రంగంలో ప్రస్తుతం ఆదాయం వచ్చినా రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, నేను కళామ తల్లిని నమ్ముకున్నాను నేను నమ్ముకున్న సినిమా రంగమే నన్ను ముందుకు తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను.
- జోష్ టీం