Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హస్రత్ గురించి తెలుసుకునే వారికి అతడి జీవితం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అతని ప్రజ్ఞ బహుముఖమైంది. ముస్లీం మతస్థుడైనా కూడా శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ కీర్తనలు రాసాడు. అలాగని ఇస్లాంని ఎన్నడూ త్యజించలేదు. ఎన్నో పదవులను బాధ్యతలను అత్యంత విధేయతతో నిర్వర్తించాడు. తన జీవితంలో ఆడంబరానికి, వాదనలకు తావివ్వని హస్రత్, ఆద్యంతం అత్యంత నమ్రతో జీవిస్తూ మానవత్వానికి నిలువెత్తు రూపమయ్యాడు.
మూలం...
చుప్కే చుప్కే రాత్ దిన్ ఆంసూ బహానా యాద్ హై
హమ్ కో అబ్ తక్ ఆశిఖీ కా వో ?మానా యాద్ హై
బా-హజారాం ఇజ్తిరాబ్ ఒ సద్-హజారాం ఇశ్తియాక్
తుర్a సే వో పహ్లే-పహల్ దిల్ కా లగానా యాద్ హై
ఖీంచ్ లేనా వో మిరా పర్దే కా కోనా దఫ్అతన్
ఔర్ దుపట్టే సే తిరా వో మూV్‌ా ఛుపానా యాద్ హై
ఆజ్ తక్ నజ్రోం మే హై వో సొహ్బత్-ఎ-రాజ్-ఒ-నియాజ్
అప్నా జానా యాద్ హై తెరా బులానా యాద్ హై
చోరీ చోరీ హమ్ సే తుమ్ ఆ కర్ మిలే థే జిస్ జగV్‌ా
ముద్దతే గుజ్రీ పర్ అబ్ తక్ వొ ఠికానా యాద్ హై
శౌఖ్ మే మెహందీ కే వో బే-దస్త్-ఒ-పా హోనా తిరా
ఔర్ మిరా వో ఛేడ్నా వో గుద్గుదానా యాద్ హై
బావజూద్-ఎ-ఇద్దిఆ-ఎ-ఇత్తిఖాటౌ ''హస్రత్'' ముఝే
ఆజ్ తక్ అV్ా్ద-ఎ-హవస్ కా వో ఫసానా యాద్ హై
అనువాదం...
రేయింబవళ్ళు మౌనంగా కన్నీరు కారడమూ గురుతున్నది
ఆనాటి మన ప్రేమాయణం నాకు ఈనాటికీ గురుతున్నది
అదుపులేని వేవేల ఆలోచనలతో పాటు కొన్ని లక్షల కోరికలు
నీతో ఆ మొదటి క్షణం గుండెను ముడివేయడమూ గురుతున్నది
మన మధ్యలో పరదా అంచును వెనువెంటనే లాగేసెరు
ఇంకా దుపట్టాతో నీ మూతిని దాచడమూ గురుతున్నది
ఇప్పటికీ చూపుల్లోనే ఉంది ఆ రహస్యమైన స్నేహం
నేను పోవడమూ, నువ్వు పిలవడమూ గురుతున్నది
చాటుమాటుగా నువ్వు నన్ను ఏ చోటనైతే కలిసేదానివో
కాలం గడిచింది కానీ ఇప్పటికీ ఆ ప్రదేశమూ గురుతున్నది
ఇష్టంతో గోరింటాకు పెట్టుకున్న నిన్ను చూడాలి మరి
ఇంక నేను వెక్కిరించడమూ గిలిగింతలు పెట్టడమూ గురుతున్నది
సావధానంగా ఉండాలన్న మాట పక్కనపెడితే ''హస్రత్'', నాకు
ఆనాటి చిలిపి వయసులోని మధుర గాథ ఈనాటికీ గురుతున్నది
స్వాతంత్య్ర సమరయోధుడిగా, పాత్రికేయుడిగా, రాజకీయవేత్తగా, సాహితీవేత్తగా, తత్త్వవేత్తగా తనలోని విభిన్న పార్శ్వాలను ప్రకటించుకుంటూ, స్వతంత్ర భారత దేశ సాధన మరియు అభ్యున్నతి కోసం పరిశ్రమించిన హస్రత్ మొహానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొహాన్ నగరంలో 14 అక్టోబర్ 1878లో జన్మించాడు. హస్రత్ అసలు పేరు సయ్యద్ ఫజల్ ఉల్ హసన్. హస్రత్ గురించి తెలుసుకునే వారికి అతడి జీవితం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అతని ప్రజ్ఞ బహుముఖమైంది. ముస్లీం మతస్థుడైనా కూడా శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ కీర్తనలు రాసాడు. అలాగని ఇస్లాంని ఎన్నడూ త్యజించలేదు. ఎన్నో పదవులను బాధ్యతలను అత్యంత విధేయతతో నిర్వర్తించాడు. తన జీవితంలో ఆడంబరానికి, వాదనలకు తావివ్వని హస్రత్, ఆద్యంతం అత్యంత నమ్రతో జీవిస్తూ మానవత్వానికి నిలువెత్తు రూపమయ్యాడు. గజల్ ఉనికి అంతరించిపోతున్న సమయంలో సాంప్రదాయ, ఆధునిక కవితాశైలులను రంగరించి తనదైన భావుకతతో గజల్‌కి ప్రాణం పోసి తన రచనల్లో నాటి సమకాలీన సామాజిక-రాజకీయ వాస్తవికతను నిక్షిప్తం చేశాడు. కుల్లియత్-ఎ-హస్రత్, షర్Û-ఎ-కలామ్-ఎ-గాలిబ్, ముషాహిదత్-ఎ-జిందాన్ మొదలై నవి ఇతని రచనలు. హస్రత్ సాంప్రదాయ, ఆధునిక కవుల సాహిత్యాన్ని సేకరించి ఏడు భాగాలుగా విభజించాడు. 1951 మే 13న లక్నో నగరంలో హస్రత్ చివరి శ్వాస విడిచాడు.
ఈ గజల్‌కి ఒక ప్రత్యేకత ఉంది. 1982లో వచ్చిన ''నికాహ్'' చలనచిత్రంలో ఈ గజల్ (ఎంపిక చేసిన షేర్లు)ని ఉర్దూ గజల్ గాయకా గ్రేసరులలో ఒకడైన ఉస్తాద్ గులాం అలీ పాడాడు. ఈ గజల్లోని కవితా వస్తువు ఒక్కటే. కవి గజల్ మొత్తంలో తన యవ్వనంలోని ప్రేమాయణాన్నే వ్యక్తపరిచాడు. నోస్టాల్జియా (గత జీవితానుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం) ఈ గజల్‌కి నేపథ్యం అని చెప్పవచ్చు. సాధారణంగా గజల్లో అసాధారణ భావవ్యక్తీకరణలు, అతిశయోక్తి వర్ణనలు, గంభీరమైన భావాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. కానీ ఈ గజల్ మాత్రం అలా లేదు. ఇందులో భావవ్యక్తీకరణ అత్యంత సహజంగా సాగింది. జరిగింది జరిగినట్టుగా చెప్పినట్టు అనిపిస్తుంది. హస్రత్ గొప్పతనమే ఇది. తన సరళమైన శైలి మనసుకు హత్తుకుపోయేలా ఉంటుంది. అతని లాగే అతని కవితలో కూడా సహజమైన నిరాడంబరత, వాస్తవికత కనిపిస్తాయి. తన కవితల్లో యవ్వనంలోని ప్రేమానుభాతులను చదివినప్పుడు, అవి అందరి అనుభూతులేనని అనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే, గజల్ అనేది శ్రోతల మనసులతో ముచ్చటించేలా ఉండాలని అర్థమవుతుంది. ఉర్దూ మహాకవుల చాలా గజళ్ళు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. కవితలు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఉండాలన్నది వారి ఉద్దేశ్యం.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
సెల్ : 9441002256