Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజ లోపాలను సరిచేసి సమాజాన్ని చైతన్య పరిచే చైతన్య గీతికై మూఢనమ్మకాలను ఆమడదూరం చేసే మంత్రదండమై సమసమాజ స్థాపనకై నినదించే ప్రజా గొంతుక నాకవిత
అవినీతి అక్రమాలను అంతుచూసే అక్షరాస్త్రామై నీతి నిజాయితీకి పట్టంకట్టే వజ్రసింహాసనమై అభ్యుదయభావాలను అవనికి అందించే విప్లవ జ్యోతి నా కవిత
ఆత్మీయత అనురాగాలను ధాత్రికి ధారపోసే మరో జననిగా బరువు బాధ్యతలను గుర్తుచేసి బ్రతుక్కి బంగారు దారి చూపే కన్నతండ్రిగా సూదూరమవుతున్న బంధాలను కలిపే ఆత్మబంధువు నాకవిత
తెలియని విషయాలను అణ్వేషించి తెలిపే నిత్యాణ్వేషిగా గమనం తెలిక అంధకారం అలిమినప్పుడు లక్ష్యానికి దారి చూపే మార్గదర్శిగా లోకానికి విజ్ఞానాన్ని అందించే బహుముఖ విజ్ఞానబండాగారం నాకవిత
మనఃకుహురంలో దాగిఉన్న ప్రతిభను వెలికితీసే ఉపాధ్యాయినిగా కులమత అంతరాలు లేని కలలప్రపంచ నిర్మాతగాదేశ భక్తిని ప్రజ్వలించి జాతిని ఐక్యం చేసే మరో జాతిపిత నా కవిత
సమాజ జాగృతమే నా కవనమై
జన సంఘటితమే నా ధ్యేయమై
సిరా ఇంకుతో సమాజ కొవ్వు కరిగేదాక
నా కలము చేసే కవన ప్రయాణం
జనుల్లో తెచ్చేను నవ జీవనయానం
- డి.అమీర్
సెల్: 9642480702