Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదంతా గొప్ప కల్చరే,
కానీ పక్కోడు బాగుపడితే ఏడుస్తాం..ఏమనుకోకు
మన నాయకులు నిజాయితీపరులే, కాకపోతే బ్లాక్ మనీ ఫారిన్లో ఉంటది లైట్ తీసుకో...
మనది భిన్నత్వంలో ఏకత్వమే, కాకపోతే ఇల్లు కిరాయి ఇచ్చేటప్పుడు కులం అడుగుతారు కొంచెం అడ్జస్ట్ చేసుకో. . .
మేమంతా ఒకే దేవుణ్ణి మొక్కుతాం, కాకపోతే కొంచెం అంటుడు, ముట్టుడు ఉంటది పట్టించుకోకు..
మనమంతా ఒకే మతస్తులం,
కానీ వేరే కులం అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తారు. కొంచెం జాగ్రత్త...
60 -70 వేలు జీతం తీసుకుంటాం, ఆఫీసులో ముచ్చట్లు పెడతాం
కొంచెం చూసి చూడనట్టు ఉండు.
లెక్చరర్ చెప్పే క్లాసులు వింటాం, బయటకెళ్ళి బాబాల కాళ్లు మొక్కుతాం..
కొంచెం కళ్ళు మూసుకో.
ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తాం, మెడలో తాయత్తులు కట్టుకుంటాం ఏదో ఆత్మ సంతృప్తి కోసం అంతే.
అందరం కలిసి పోరాడుదాం,
వెనకవాన్ని ముందరేద్దాం..
కొంచెం రక్షణ కోసం.
అన్నింటికీ తల ఊపితే అభిమాని అవుతావ్, కాదని ప్రశ్నిస్తే శత్రువు అవుతావు..
చూసుకో మరి..
- బట్టు శివకుమార్