Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టినదిమొదలు
దినదినం మార్పు సహజం
జీవనగమనంలో మారనివాడు
నవ్యత్వం కోల్పోయి కొరగాకుండా
బూజుపట్టిన పాతసామానులా
ఓ ములనే
ఎక్కడైన ఎప్పుడైనా
వీచేగాలిలా కదిలిపోవాల్సిందే!
లేకపోతే అదేదైనా
చైతన్యం చచ్చిన పీనుగలా
సమాజం నిన్ను
కప్పిపెడుతుంది జాగ్రత్త!
సంకోచవ్యాకోచాలలా
గమనం సాగాలంతే
సమస్యలతో
సహవాసంకాదు చేయాల్సింది!
పరిష్కారాలకోసం పరిగెత్తాలి!!
జడత్వంతో నిశ్చలంగుంటే
ప్రపంచం నిన్ను మరుగుపరుస్తుంది
కదులు మెల్లగా...!
నిన్ను నీవే మలచుకునేందుకు
నీలోని నిన్ను గెలుచుకునేందుకు
జీవితం చాలా చిన్నది
నేర్చుకునేందుకు మనచుట్టు
ఎన్నో ఎన్నెన్నో...
సమయంతో పరిగెత్తాలంటే
సరైన ప్రణాళిక రచించాల్సిందే
ప్రణాళికను ఆచరించడమే
మార్పునకు నాందవుతుంది
ఆ మార్పు
నిన్ను నీ ముందు ఆవిష్కరిస్తుంది
జంకని అడుగులే దానికవసరం
జగమంతా జయించేందుకు
ఓ పరిధిలో బందీవవ్వకు?!
విస్తరిస్తూ విహరించు
వినయాన్ని ఆభరణంగా ధరించి
విశ్వవీదిలో విజయపతాకమెగరేరు!!
- సి. శేఖర్(సియస్సార్),
9010480557.