Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకవైపు అభివద్ధి
అంతరిక్షాన్ని తాకుతుంటే
మరోవైపు కరడు గట్టిన ఆకలి
పేద ప్రేవుల్ని సంపుతుంది..
అరగని వాడికి రెండుకాళ్ళు
తలో దిక్కున పడ్తుంటే
దొరకని వాడు రెండుకాళ్లను
కడుపున పెట్టుకుంటున్నాడు..
సమయం విలువైనదే కానీ
కనీసం ఒకడి ఆకలితీర్చలేనంత కాదు
ఓ నిరాశ్రయుడి జీవితపు వేదన ముందర
మోయలేని ఆవేదన కాదు..
జాలి, కరుణలు కేవలం పురాణాల్లోని
పుక్కిటి సూక్తులే
భూత దయ భూతకాలపు మాయయైతే
మానవత్వం మట్టి కరిచింది
మహనీయుల ప్రవచనాలు మనకు
ఏ కోణాన పచనం కావట్లేదు
టిక్ టాక్, పబ్ జీ, ఫ్రీ ఫైర్ ముందర
అనుబంధాలన్ని ఫైర్ అవుతున్నాయి..
ఫుట్ పాత్ పై ఓ అభాగ్యుడు సల్లసలికి
వణుకుతూ ఆకలిని కడుపులో
దోపుకుని జీవితాన్ని నడుపుతుండు
మరొకడు ఆకలి, నిద్ర నడుమ
జరిగే నిత్యసమరంలో మూలుగుతూ
గాయపడ్డ కోకిల అవుతుండు..
-సర్ఫరాజ్ అన్వర్..
9440981198