Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం
ఖహ్ర్ కీ క్యూ నిగాహ్ హై ప్యారే
క్యా మొహబ్బత్ గునాహ్ హై ప్యారే
శక్ భీ కిస్ పర్, మిరీ మొహబ్బత్ పర్
జిస్ కా తూ ఖుద్ గవాహ్ హై ప్యారే
సచ్ బతా కుఛ్ ఖఫా హై తూ ముర్a సే
యా హయా సద్ద్-ఎ-రాహ్ హై ప్యారే
అజ్నబీ బన్ రహీ హై తెరీ నజర్
ఖత్మ్ క్యా రస్మ్ ఒ రాహ్ హై ప్యారే
రాహ్-ఎ-ఉల్ఫత్ మే ఠహర్నా కైసే
దమ్ భీ లేనా గునాహ్ హై ప్యారే
ఇష్క్ మే వో భీ ఇక్ వఖ్త్ హై జబ్
బే-గునాహీ గునాహ్ హై ప్యారే
ఔర్ ముల్లా కో క్యా మిటాతే హౌ
వో తో యూంహీ తబాహ్ హై ప్యారే
అనువాదం
కోపపు చూపులు ఎందుకే చెలియా
వలపేమైనా పాపమా చెలియా
నీ అనుమానమెవరిపైన? నా ప్రేమ పైనా?
నా ప్రేమకు సాక్షివి నువ్వే చెలియా
నిజం చెప్పు! నువ్వెందుకో నిరాశ చెందావు
సిగ్గనేది మన మధ్యలో అడ్డంకు చెలియా
తెలియని దానిలా తయారవుతుంది నీ చూపు
మన అనుబంధంఇక ముగిసినట్లేనా చెలియా
ప్రేమ మార్గంలో విశ్రాంతి అన్నది ఎక్కడిది?
శ్వాస తీసుకోవడం కూడా పాపమే చెలియా
ప్రేమలో ఇలాంటి సమయం కూడా ఒకటుంటుంది
అప్పుడు తప్పు చేయకపోవడమూ తప్పే చెలియా
ఇంకా ఈ 'ముల్లా' నెందుకు వేధిస్తున్నావు
చూస్తుండగానే అతను నశించిపోయాడు చెలియా
తమ వత్తి సాహిత్యం కాకున్నా ఎందరో మహానుభావులు భాష పైనున్న మక్కువతో అద్వితీయమైన సాహిత్య సేవ చేసి చరిత్రకెక్కారు. 20వ శతాబ్దపు ప్రముఖ ఉర్దూ కవులలో ఒకడైన ఆనంద్ నారాయణ్ ముల్లా ఆ కోవకు చెందిన వాడే. 1901 అక్టోబర్ 24న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన ఆనంద్ నారాయణ్, ఆంగ్లంలో బీ.ఏ, ఎం.ఏ చేసాడు. ఆ తరువాత 1925లో కన్నింగ్ కాలేజ్ నుండి ఎల్.ఎల్.బీ పట్టా పొందాడు. న్యాయవాదిగా వత్తిని ప్రారంభించిన ఆనంద్ నారాయణ్, 1955లో లక్నౌ హైకోర్టు జడ్జీగా విధులు నిర్వహిస్తూ తన జీవితంలో నూతన శిఖరాలను అధిరోహించాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 4వ లోక్ సభ సభ్యుడిగా, అలాగే 1972లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. జూ-ఇ షీర్, కర్బ్-ఎ-ఆగహీ , జాదా-ఇ-ముల్లా మొదలైన రచనలు చేసిన ఆనంద్ నారాయణ్ భారత మాజీ ప్రధానీ జవహర్ లాల్ నెహ్రూ రాసిన లేఖలను అనువదించాడు. ఆంగ్ల సాహిత్యం చదువుకున్న విద్యార్థిగా ఇతను మొదట్లో
ఆంగ్లంలోనే కవిత్వం రాసేవాడు. ఆ తరువాత సాహిత్యానికి సంస్కతికి కేంద్రమైన తన జన్మస్థలం, లక్నౌ గొప్పతనాన్ని అవగతం చేసుకుని కవిగా ఎదిగాడు. సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్న తపన, ఇతని రచనల్లో స్పష్టంగా కనబడుతుంది. అంజుమన్-ఎ-తరఖీ? ఉర్దూ కి చైర్ పర్సన్ గా కూడా వ్యవహరించాడు. 1964లో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న ఆనంద్ నారాయణ్ ముల్లా, 1997 జూన్ 12 న ఢిల్లీలో మరణించాడు.
మనిషి నాగరికత యొక్క గతి భాష, చరిత్ర మరియు సంస్కతుల పైన ఆధారపడి ఉంటుంది. భాష చరిత్రలను, సంస్కతులను తరతరాలకు మోసుకెల్తుంది. శతాబ్దాల భారతీయ సామాజిక ఆర్థిక రాజకీయ చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా పరిణామం చెందిన ఉర్దూ భాషా సాహిత్యంలో గజల్ ప్రక్రియ పాత్ర చాలా శ్రేష్టమైనది. కొన్ని శతాబ్దాల భారతీయ చరిత్ర మరియు సంస్కతి ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. వాస్తవానికి గజల్ అనేది ఫార్సీ కవితా ప్రక్రియ. భారతదేశంలో 14-15 శతాబ్దాల ముందు అన్ని మతాల పండితులు ఫార్సీ భాషలోనే రాయడానికే మొగ్గు చూపేవారు. ఈ క్రమంలోనే గజల్ ప్రక్రియ భారతదేశంలో దిగుమతి అయ్యింది. ఆ తరువాత ఉర్దూ భాష సాహిత్య భాషగా పరిణామం చెందాక, ఫార్సీలో కంటే ఉర్దూలోనే గజల్ ఎక్కువగా వ్యాప్తి చెందింది. పండితుల నుండి పామరుల వరకు అందరి మనసులును ఆకట్టుకుంది. గజల్ ప్రక్రియలో ప్రేమ, శంగారం, విరహం మరియు విషాదమే కాక తత్వం, దేశభక్తి, నీతి, రాజనీతి మొదలైన విషయాలను సరళమైన, సరసమైన మరియు మధురమైన భావాలతో కూడిన శబ్దాలతో (పదాలతో) వర్ణిస్తారు. అయితే గజల్ లో ప్రాథమికంగా రెండు రకాల ప్రేమ భావాలుంటాయి- ఇష్క్-ఎ-మజాజీ (ప్రాపంచిక ప్రేమ - మనుషుల మధ్య ఉండేది), ఇష్క్-ఎ-హకీకీ (పారమార్థిక ప్రేమ- మనిషికి దేవుడికి మధ్య ఉండేది). ఈ గజల్ లో తన నుండి విడిపోయిన ప్రేయసితో కవి తన అవస్థను గురించి అలాగే ప్రేమను గురించి సంభాషిస్తాడు. ఎడబాటులో ఉన్న కవి సంభాషిస్తూనే వేదనకు గురి అవుతాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256