Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను ఆకాశంలోకి చూసి, 'నాకు హద్దులు లేవంటూ' ఆకాశానికి చెప్పాను. అది నన్ను ఆసక్తిగా చూసింది. నా ఉద్దేశం చాలా క్లియర్... నేను కలలు కంటూనే ఉంటాను. వాటిని నిజం చేసుకుంటాను. కలలు కనడం నా హక్కు, సాకారం చేసుకోవడం నా బాధ్యత. ఇష్టంతో కన్న ఆ కల సాకారంలో కష్టం కనుమరుగవ్వాల్సిందే..' ఆ ఆశయమే అతడికి జీవం పోసింది. ఆ స్ఫూర్తే మనసంతా నింపుకున్న యువకుడు కాల పెట్టిన పరుగు పందెంలో కాలాన్ని జయించాడు. తాను కన్నకలలను సాకారం చేసుకున్నాడు. సివిల్స్‌లో విజయ శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైన యువకుడు..దేవానంద్ తెల్గోటే. మరణం అంచులు దాకా వెళ్లి చావును జయించి దేశానికి పట్టుగొమ్మ అయిన పరిపాలనలో భాగమవుతాన సంకల్పంతో ఈ నెలలో యుపిఎస్సి సివిల్స్‌లో సివిల్స్ ఇంటర్వ్యూకు హజరు కానున్న యువకుడు ఎంద ఎందరికో స్ఫూర్తి అతని 'జోష్' ఫోకస్..!
ముంచుకొచ్చిన ముప్పు
సివిల్స్ సాధించాలనేది ఎంతోమంది కల. ఓ యువకుడు ఆ ప్రయత్నంలో ఎంతో శ్రమించి సివిల్స్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తి చేసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. దానికి హాజరుకావడమే తరువాయి. ఇంతలో కరోనా సోకింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్టుయింది. ఇంటర్వ్యూకు 15 రోజులే సమయం ఉంది. భయం వెంటాడుతున్నా.. ధైర్యాన్ని కూడగట్టుకొని కరోనా తగ్గిపోతుందని భావించాడు. ఆరోగ్యం కుదుటపడలేదు సరికదా.. రోజురోజుకు విషమంగా మారింది. చివరికి గుండె ధైర్యం, దాతల సాయం, వైద్యుల కషితో మత్యువును జయించాడు. సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు.
ఆశయం గెలిచింది
మహారాష్ట్రకు చెందిన దేవానంద్ తెల్గోటే (26) కథ ఇది. సివిల్స్ సాధించాలనేది అతడి జీవితాశయం. ఇప్పటికే ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. విజయం దక్కకపోవడంతో. . రెండోసారి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వచ్చాడు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన సమయంలో జ్వరం వచ్చింది. చివరకు కరోనాగా తేలింది. ఆ మహమ్మారి అతన్ని మత్యుముఖం వరకు తీసుకెళ్లింది. ఢిల్లీ, మహారాష్ట్రలో చికిత్స చేయించినా నయం కాలేదు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యుల సూచనల మేరకు ఆఖరి ప్రయత్నంగా ఎయిర్ అంబులెన్సులో మే 15న హైదరాబాద్ కిమ్స్‌కి తరలించారు. దేవానంద్ తెల్గోటేది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఓ ప్రయివేటు ఉద్యోగి. అంతకంటే ముందు ఆర్మీ ఉద్యోగి. తల్లి గహిణి. పెద్దన్న ఆర్మీలో పనిచేస్తున్నాడు. కుమారుడు సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైనందుకు ఎంతో ఆనందించారు. అంతలోనే కరోనా అని తెలిసి తల్లడిల్లిపోయారు. తెలిసిన వారి సాయంతో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్
భగవత్‌ను కలిసి వేడుకోవడంతో కిమ్స్ వైద్యులతో మాట్లాడి పడక ఇప్పించడమే కాకుండా దేవానంద్ కోలుకోవటానికి తన వంతు సాయం అందించారు. ఓ దశలో ఊపిరితిత్తులు మారిస్తే కానీ దేవానంద్ ప్రాణాలు దక్కని పరిస్థితి తలెత్తింది. అలా చేస్తే మందుల వాడకంతో పాటు ఆరోగ్య పరంగా అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ఆర్నెల్ల నుంచి ఏడాదిపాటు ఇంటికే పరిమితం కావాలి. ఇది దేవానంద్ లక్ష్యం, భవిష్యత్‌కు అవరోధంగా మారుతుంది. దీంతో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ సందీప్ అత్తావర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. మార్పిడి అవసరం లేకుండానే మెరుగైన చికిత్సతో దేవానంద్ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చారు. క్రమంగా దేవానంద్ ఆరోగ్యం కుదుటపడింది. అంతకుముందు దేవానంద్‌తోపాటు కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు ఎంపికై సర్వీసుల్లో చేరినవారు తలాకాస్తా సాయం చేశారు. మహేశ్ భగవత్ విజ్ఞప్తి మేరకు పలువురు ఐపీఎస్‌లు దాతల నుంచి రూ.కోటి వరకు సమీకరించి ఆ యువకుడి చికిత్సకు వెచ్చించారు. కిమ్స్ ఆసుపత్రి సైతం రూ. 20 లక్షల రాయితీ ఇచ్చింది. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులు డాక్టర్ సందీప్ అత్తావర్ నేతత్వంలోని వైద్యబందం అవిశ్రాంతంగా శ్రమించింది. మూడు నెలలకుపైగా ఎక్మో సపోర్టు అందించింది.
యూపీఎస్సీ సహకారం
అతని సంకల్ప బలం ముందు మత్యువు తల వంచింది. క్రమంగా కోలుకుంటుండగా మరో సమస్య ఎదురైంది. మూడు నెలలకు పైగామంచానికే పరిమితం కావడంతో కండరాలు చచ్చుబడిపోయాయి. దీనికి ప్రత్యేకంగా ఫిజియోథెరపీ చేయించారు. దేవానంద్ క్రమంగా కోలుకుని ఈ వారం కిమ్స్ నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. యూపీఎస్సీ అతడి విషయంలో సానుకూలంగా స్పందించింది. మే 5న నిర్వహించాల్సిన ఇంటర్వ్యూను సెప్టెంబరు 22కు మార్చింది. తనకు పునర్జన్మ ఇచ్చిన వైద్యులు, సిబ్బంది, క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆదుకున్న మానవతావాదులకు దేవానంద్ కతజ్ఞతలు తెలిపాడు. సివిల్స్‌లో తప్పకుండా విజయం సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
- అనంతోజు మోహన్ కృష్ణ ..