Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనతో గడపాలని ఆరాటం
తనతో కలిసి ఉండాలని పోరాటం
తపనెంతా పడినా
తప్పెవరిదైనా తనకు నాకు అగాధం..
అల్లుకున్న మల్లె తీగను
పందిరి నుంచి దూరం చేసినట్లు
అలుపెరుగని ప్రేమతో మనుగడ సాగిస్తున్న
కలువను తెంపి కొలను మనసులో
కల్లోలం రేపింది పాడు కాలం...
మల్లె పూల పరిమళాల ధూపంలో
మైమరచి నిదురపోయే పందిరికి
నేడు కాళరాతిరి...
కలువను తాకిన జాబిల్లి వెలుగులో
చల్లగా సేదతీరే కొలనుకు
నేడు చేరదు నిదుర దరి...
ప్రేమించిన మనస్సుకుగాయం చేసిన జవరాలీ...
ఆగి వినవా ఒకసారి..
రక్తం చిందించకుండానే రక్తపాతం సష్టించావా?
ఆయుధం అవసరం లేదని నిరూపించావా..??
కఠిన నిర్ణయానికి కారణమేదైనా
కాసింత ఓపిక పెట్టి చూడు...
హదయం లేని జీవమై
సందడి లేని ఉద్యానవనమైన మనిషిని ఒకసారి..
ఐనా, నీపై ఇసుమంత ద్వేషం రాలేదు
కాసింత క్షణికమైన కోపం తప్ప...
నేను ఇంతకు మించి ఏం చెప్పగలను...చూపగలను
భగమైన నా కలల శిథిలాలను తప్ప....
మిగిలిపోయిన నీ తీపి గురుతులను తప్ప...
- సుద్దాల వినోద్ కుమార్ ,
9908312949