Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జన్మలు కర్మలు వేరయినా
జత కలిపే
శ్వాసలు ఆశలు వేరయినా
కలగలిపే
కలిసి చదువుకునే పుస్తకం
అపార్ధాలకు చోటులేని
అపనమ్మకాలకు తావులేని
ఒకటే తలపుల
గుండె సవ్వడి
మనసున నాటుకున్న
అనురాగ శరం
స్నేహించే హదికి
ఆరో ప్రాణం
నిరాశలు తొలగించి
వసంతశోభలు కూర్చే
మధురస్మతుల తొలకరి
పిల్ల తెమ్మెరల చల్లదనం
పాలమీగడల కమ్మదనం
నిత్యం సత్యమై వెలిగే
సుందరస్వప్నాల జ్యోతి
ఉప్పెనలా కష్టాల సంద్రం
అమాంతం ముంచినా
తీరాన్ని చేర్చే కెరటం
నిస్వార్థానికి ప్రతీక
త్యాగానికి చిరునామా
అన్ని బంధాల కన్నా
అపురూపమైనది
అదొక కరగని కల
విరగని అల
హదయంలో ఉదయించి
చావులో అస్తమించేది