Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ కొమ్మలకో పూసిన పువ్వులం మనం
ఏ పూవైనా వాడాక రాలాల్సిందే
వేదనళ్లా....
ఏ ప్రకతి విపత్తో, ఎవరో ఒకరో
బలవంతంగా తుంచివేసినపుడే...
పువ్వును తుంచిన మొదట్లో...
మనసు దుర్భినేసి చూడండి
ఎంత చిక్కటి కన్నీటిని స్రవిస్తుందో...
జీవిత ఫలదీకరణలో
ఎవరికి వారమే ఉమ్మెత్త పువ్వులం
అనురాగం,ఆప్యాయతలలో
పరాగ రేణువులం
ప్రేమానురాగాలు, ఆత్మీయబంధాల
పరపరాగా సంపర్కంతో
ప్రేమ కొమ్మకు మొగ్గతొడిగిన రెండు పూలు
ఏ కొండ గాలో
ఒక పువ్వును నెల రాలిస్తే
ఒంటరి పుష్పం వికసించేదెట్లా?
వాడే దాకా రాలకుండా ఉండగలదేమో కానీ
వేదనైతే చెందకుండా ఉండగలదా?
ఆ ఒంటరి పుష్పం...
- దిలీప్.వి, సెల్: 8464030808