Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం :
సబ్కో మాలుమ్ హై మై శరబీ నహీ,
ఫిర్ భీ కోఈ పిలాయే తో మై క్యా కరూ
సిర్ఫ్ ఇక్ బార్ నజ్రోం సే నజరే మిలే,
ఔర్ కసమ్ టూట్ జాయే తో మై క్యా కరూ
ముర్a కో మయకశ్ సమఝ్తే హై సబ్ వాదాకశ్,
క్యోం కీ ఉన్ కీ తరV్‌ా లడఖడాతా హూ మై
మేరీ రగ్ రగ్ మే నశా మొహబ్బత్ కా హై,
జో సమర్a మే నా ఆయే తో మై క్యా కరూ
మైనే మాంగీ థీ మస్జిదోం మే దుఆం,
మై జిసే చాహతా హూ వో ముర్a కో మిలే
మేరే జో ఫర్జ్ థా మైనే పూరా కియా,
అగర్ ఖుదా హీ న చాహే తో మై క్యా కరూ
హాల్ సున్ కర్ మేరా సహ్మే సహ్మే హై వో,
కోఈ ఆయా హై జుల్ఫే బిఖేరే హుయే
మౌత్ ఔర్ జిందగీ దోనోం హైరాన్ హై,
దమ్ నికల్నే నా పాయే తో మై క్యా కరూ
కైసీ లత్, కైసీ చాహత్, కహాం కీ ఖతా,
బేఖుది మే హై 'అన్వర్' ఖుద్ హీ కా నశా
జిందగీ ఎక్ నశే కే సివా కుఛ్ నహీ,
తుంకో పీనా నా ఆయే తో మైన్ క్యా కరూ
అనువాదం :
అందరికీ తెలుసు నేను త్రాగుబోతుని కానని
మరి తెలిసి కూడా తాగిస్తానంటే నేనేం చేయను
కేవలం ఒక్కసారికే చూపులు రెండూ కలిసాయి
ఇక నాలో నిలకడ మొత్తం చెడితే నేనేం చేయను
త్రాగబోతులాగ ఊగుతున్నానని చూసిన జనాలు
నేను ఒక పెద్ద త్రాగుబోతునని అనుకుంటున్నారు
నా నరనరాల్లోని నిషా అంతా ప్రేమ వల్లనే ఉన్నది
మీకీ విషయం బుర్రకు తట్టకపోతే నేనేం చేయను
నా మనసు వలచిన వయ్యారి మగువ దొరకాలని
మసీదులకు వెళ్ళి దుఆ కోసం నేను వేడుకున్నాను
చేయాల్సిన ప్రయత్నాలన్నీ నే ఏకాగ్రతతో చేసేసాను
చివరికి ఆ దయాళుడే మెచ్చకపోతే నేనేం చేయను
నేను పడే వేదన విని విరబోసిన ముంగురులతో
ఎవరో భయంభయంగా నా ముందుకు వచ్చారు
చావుబ్రతుకులూ రెండు భయానక వైపరిత్యాలు
ఒకేసారి ఎదురై నా ఊపిరినాపితే నేనేం చేయను
ఎక్కడివీ చెడు అలవాట్లు, ఏది తప్పు, ఏది ఒప్పు
'అన్వర్' నిషాలోనే అందరి స్వయం ప్రకాశం ప్రజ్వలిస్తుంది ఏ మత్తూ లేని మనిషి జీవితం అసలు జీవితమే కాదు ఇదంతా తెలీని నీకు త్రాగడం
రాకుంటే నేనేం చేయను.
ఇరవైవ శతాబ్దపు ప్రఖ్యాత ఉర్దూ గేయ రచయితలలో, సూఫీ కవి, అన్వర్ ఫర్రుఖాబాదీ ప్రముఖుడు. ఇతని కలం పేరు ఫనా. 1928 జులై 19న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫర్రుఖాబాద్ జిల్లాలో జన్మించిన అన్వర్, గజల్, గీతం, ఖవ్వాలీ మొదలైన సాహిత్య ప్రక్రియల్లోని సారాన్ని గ్రహించి అమోఘమైన కవిత్వ రచన చేసాడు. అల్ హిలాల్ (1958), హాలిడే ఇన్ బొంబే (1963) వంటి బాలీవుడ్ చిత్రాల్లో అలాగే ఇతర ప్రైవేట్ ఆల్బమ్‌లలో కలిపి సుమారు 2000 వరకు పాటలు రాసాడని అంచనా. 1992లో ఇతను రాసిన ''యే జో హల్కా హల్కా సురూర్ హై'' అనే ప్రసిద్ధ ఖవ్వాలీ గీతాన్ని 'కింగ్ ఆఫ్ ఖవ్వాలీ''గా పిలువబడే ప్రఖ్యాత ఉర్దూ గాయకుడు నుస్రత్ అలీ ఫతేహ్ ఖాన్ స్వరపరచి స్వయంగా తానే గానం చేశాడు. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఖవ్వాలీ సంగీత కళాఖండానికి చక్కని మచ్చుతునకగా నిలిచింది. అన్వర్ రచనల్లో ఉండే తీవ్రమైన రసాత్మకత శ్రోతలను ఉర్రూతలూగించి వారి మనసులను ఆర్ద్రతతో తడుపుతుంది. నుస్రత్ అలీ ఫతేహ్ ఖాన్, శమ్శద్ బేగం, పంకజ్ ఉదాస్, మొహమ్మద్ రఫీ వంటి మహాగాయకులు అన్వర్ రాసిన గజళ్ళను పాటలను పాడి వాటికి అమరత్వాన్ని చేకూర్చారు. 83 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని అనుభవించిన అన్వర్, 2011 జూన్ 9న ఫర్రుఖాబాద్ లోని స్వస్థలమైన నఖా?స్ లో తన చివరి శ్వాస విడిచాడు.
ప్రముఖ గజల్ గాయకుడు పద్మశ్రీ పంకజ్ ఉదాస్ 1981లో విడుదల చేసిన ముకరార్ అనే సంగీత ఆల్బమ్ లో ఈ గజల్ ని తీసుకున్నాడు. అయితే ఈ గజల్ ని వినే ఉర్దూ భాషేతరులకు దీనిలోని భావాలు అసహజంగా అనిపించడం సహజమే. మొదటగా తెలుసు కోవాల్సిన విషయమేం టంటే ఉర్దూ కవిత్వాన్ని యథార్థ దక్పథాలతో అర్థం చేసుకోలేం. ఎందు కంటే అందులో ఉండే ఉపమానోపమేయాలు ఎంతో విలక్షణంగా ఉండి మార్మికంగా నిర్మించబడి ఉంటాయి. ఉదాహ రణ కు ఒక షేర్ తీసుకుందాం- ''అతని గిలాసలో ఏదో ఉంది, నా గిలాసలో ఇంకేదో ఉంది/ ఏం సాఖీ (మధువు పోసే స్త్రీ) ? నీ మధుశాలలో విధ్వంసం చూడాల నుందా?''. ఈ షేర్ బట్టి కవి త్రాగు బోతని, ఎందుకింత రాద్దాంతం చేస్తున్నా డనుకుంటే పొరబడినట్లే. ఇక్కడ గిలాస అంటే విధి, మధుశాల అంటే ప్రపంచం, సాఖీ అంటే భగవంతుడు. కవి అందరి తలరాతలు వేరుగా ఎందుకున్నాయని దేవుడిని అడుగుతాడు. ఈ అన్యాయం ఏంటని కోపంగా ప్రశ్నిస్తూ నువ్వు సష్టించిన ప్రపంచంలో విధ్వంసం చూడాలనుకుంటున్నావా అని అంటాడు. ఉర్దూ కవిత్వంలో మద్యపానం గురించి ప్రాథమికంగా రెండు రకాల వివరణలున్నాయి. ఎప్పుడూ సమస్యలతో సతమ తమయ్యే కవి మన సుకు మద్యం తన్మయత్వాన్ని కలిగించి ఉపశమనం చేకూరుస్తుం దనేది ఒకటైతే మద్యపానం పారమార్థిక అనుభూతి అని చెప్పే ప్రస్తావన ఇంకొకటి. ఈ రెండవ దాంట్లో సూఫీ తత్వం గోచరిస్తుంది. ఈ గజల్ రాసింది సూఫీ కవి కాబట్టి సూఫీ తత్త్వంలో మద్యపానం గూర్చి తెలుసుకుందాం. ఈ క్రమంలో నషా(మైమరపు), శరాబ్ (మధువు), పైమానా (మధుపాత్ర), మైఖానా (మధుశాల), సాఖీ (మధువు పోసే స్త్రీ) మొపప పదాల మర్మం తెలుసుకోవాలి. ఇక్కడ సాఖీ అంటే పరమాత్మ, మధుశాల అంటే ప్రపంచం, పైమానా అంటే మానవ శరీరం, మధువు అంటే పరమాత్మ ప్రేమ. కవి భక్తుడు. అతను ప్రపంచమనే మధుశాలలో ఉంటూ పరమాత్మపై ప్రేమ అనే మధువును శరీరమంతా నిండేట్లుగా తాగుతాడు. ఫలితంగా కవి తనని తాను మరచి పరమాత్ముని ప్రేమలో తన్మయుడవుతాడు. పరమాత్మపైనున్న ప్రేమను మధువుతో పోల్చి అందులోని ఏకత్వాన్ని, తన్మయత్వాన్ని (సమా) అనుభూతి చెందేందుకు మైలానా రూమీ, అమీర్ ఖుస్రో, సుల్తాన్ బాహు వంటి సూఫీ మహాత్ములు గజల్, ఖవ్వాలీ పాటలను సాధనాలుగా వాడుకున్నారు. మీర్, గాలిబ్, జౌఖ్, దాగ్, జిగర్ మొ.. కవులు సూఫీ తత్త్వంతో మతమౌడ్యాన్ని, ఛాందసత్వాన్ని ఎత్తి చూపారు.
ఈ మర్మాలేవీ తెలియని వారెందరో ఉర్దూ కవిత్వాన్ని విమర్శించారు కూడా. కవిత్వ ప్రియులు గ్రహించాల్సిన విషయమేంటంటే కవులు ఎంచుకునే కవితా వస్తువు ధర్మం ఎలాంటిదైనా కూడా అది సార్వత్రిక ఆమోదాన్ని పొందేలా ఉంటుంది. సూఫీ కవులు దైవిక సంయోగాన్ని మధువు, సాఖీ మొ.. ప్రతీకలతో పోలిస్తే మరి కొందరు సంతులు లైలా మజ్ను, రాధాకష్ణ వంటి అనుబంధాలతో పోల్చారు. అన్నిటి సారం ప్రేమ లేదా తన్మయత్వమే.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
9441002256