Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్యూబ్ లైట్లును వాడతారు. అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి. అప్పుడు వాటిని ఏవరైనా పారవేస్తారు మరల కొత్తవి తెచ్చుకొని వాడుకుంటారు. కానీ అలా పారేసే ట్యూబ్ లైట్ల వలన చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని చాలా మందికి తెలియని పచ్చి నిజం. కానీ దీనికి చక్కని పరిష్కరం కనుగొని కాలిపోయిన ట్యూబ్ లైట్లలో తిరిగి వెలుగులు నింపుతున్నారు నిజామాబాద్ జిల్లా చెందిన నర్సింహాచారి. అంతేకాదు దాని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా కలిపిస్తున్నారు.
గ్రామాల విద్యుద్దీపాలకు, ఇండ్లల్లోను సాధారణంగా ఏవరైనా ట్యూబ్ లైట్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే తక్కువ కరెంట్ తో ఎక్కువ కాంతివంతంగా ఉంటాయి అని ట్యూబ్ లైట్లును వాడతారు. అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి. అప్పుడు వాటిని ఏవరైనా పారవేస్తారు మరల కొత్తవి తెచ్చుకొని వాడుకుంటారు. కానీ అలా పారేసే ట్యూబ్ లైట్ల వలన చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని చాలా మందికి తెలియని పచ్చి నిజం.
కానీ దీనికి చక్కని పరిష్కరం కనుగొని కాలిపోయిన ట్యూబ్ లైట్లలో తిరిగి వెలుగులు నింపుతున్నారు నిజామాబాద్ జిల్లా చెందిన నర్సింహాచారి. అంతేకాదు దాని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా కలిపిస్తున్నారు. నిజానికి మాడిపోయిన ట్యూబ్ లైట్లలో మిగిలిపోయిన పాదరసం (మెర్క్యురీ) పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ట్యూబ్ లైట్ ను మళ్లీ ఉపయోగించుకునేలా చేసి అందులోని పాదరసాన్ని పూర్తిగా ఖర్చు చేస్తే దాని ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి.
ఇటు పర్యావరణానికి మేలు చేయడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. నర్సింహచారి కనుగొన్న ఫార్ములతో ఇకపై కాలిన ట్యూబ్ లైట్లను పారేయనక్కర లేదు. వాటిని మళ్లీ రెండు మూడేళ్ల పాటు మరల వెలిగేలా చేసుకోవచ్చు! అందుకు చేయవల్సిందల్లా ముందుగా మాడిపోయిన ట్యూబ్ లైట్ కు ఉన్న చౌక్ ను, స్టార్టర్ ను తీసేయాలి. వాటి స్థానంలో చారి కనుగొన్న చిన్న పరికరాన్ని అమర్చుకుంటే చాలు. మరో రెండు మూడేళ్ల పాటు ట్యూబు గ్యారంటీ.
అంతేకాదు కరెంటు బిల్లు కూడా సగానికి సగమే వస్తుంది. చారి ఫార్ములా ట్యూబ్ లైట్ల వ్యర్థాల నుంచి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఈ యువ శాస్త్రవేత్త చేసిన కషి ప్రపంచ మేథావులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణాభివద్ధి సంస్థలో టెక్నికల్ డైరెక్టర్, శాస్త్రవేత్త అయిన నరసింహాచారి ఈ ప్రయోగంపై జాతీయంగా, అంతర్జాతీయంగా పెటెంట్ కూడా పొందారు. ముందుగా ఈ ప్రక్రియను మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలుచేయాలని భావిస్తున్నారు. '' ముందుగా పాడైపోయిన ట్యూబ్ నుంచి చౌక్, స్టార్టర్లను తొలగించాలి. ట్యూబ్ లైటు పిన్నులకు అమర్చే ప్లర్లకు చారి కనుగొన్న ఈ చిన్న పరికరం వైర్లను రెండువైపులా కలిపి ప్లగ్ ను సాకెట్లో పెడితే చాలు. ట్యూబ్ ఆటోమేటిగ్గా వెలుగుతుంది''. ఒక్క ట్యూబ్ లైట్ లో ఐదెకరాలు కలుషితం ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం, పాడైపోయిన ఒక ట్యూబ్ లైట్లో కనీసం 5 మిల్లీ గ్రాముల పాదరసం ఉంటుంది.
ట్యూబ్ లైట్ పగిలిపోతే.. అందులోని పాదరసంతో కనీసం ఐదారు ఎకరాల భూమి కలుషితమై, సారం కోల్పోలా చేస్తుంది. అదే నీటిని అయితే 22, 685 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. దానివలన అనేక రకాల వ్యాధులు బ్రెయిన్ ట్యూమర్, ఆర్గానిక్ ట్యూమర్లు, ఉపిరితిత్తుల వ్యవస్థ దెబ్బతినడం వంటి శారీరక రోగాలే కాకుండా అలసట , చికాకు , ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. దీనిని నివారించడానికే మన చారి అనేక రకాల ప్రయోగాలు చేసి విజయం సాదించారు. పర్యావరణ సమతౌల్యం కాపాడితే కన్నతల్లిలాంటి భూమాతను కాపాడుకున్న వాళ్లమవుతాం అనేది ఆయన ఉద్దేశం. అదీగాక ప్రతి గ్రామంలోని కొందరు నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా దొరుకుతుందని చిన్న ఆశ ఆయనది.
పలువురు పెద్దల అభినందనలు
జాతీయ గ్రామీణాభివద్ధి సంస్థ, పంచాయితీ రాజ్ వాటర్ సానిటేషన్ మంత్రి చౌదరి బిరెందర్ సింగ్ , అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సిపి జోషి, ఆర్బీఐ మాజీ గవర్నర్లతోపాటు అనేక మంది పార్లమెంట్ సభ్యులు చారి చేస్తున్న కషిని అభినందించారు.
యువతకు ఉపాధి
ఒక గ్రామంలోని గ్రామ పంచాయితీకి ఈ ''చారి'స్ పార్ములా '' ద్వారా ముగ్గురేసి నిరుద్యోగ యువకులకు సంవత్సరం పాటు జీతాన్ని ఇచ్చి ఉపాదిని కల్పించింది. కొన్ని నోటిఫైడ్ గ్రామా పంచాయితీల్లోనైతే ఈ ప్రయోగాన్ని సంవత్సరము పాటు విజయ వంతంగా అమలు చేయడమైనది. ఇలా 500 స్ట్రీటైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ లు వున్నా గ్రామా పంచాయితీలో వారికి సంవత్సరానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది కానీ వారు ఈ చారి ఫార్ములాను సంవత్సరానికి మూడు లక్షలు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అనగా రెండు లక్షల రూపాయల ఆదా చేసుకున్నారు. ఆ గ్రామ పంచాయితీ వారి ఈ విషయాల్ని అంగీకరించి, అప్పుడు ఆ గ్రామ అభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆ జిల్లాకు చెందిన, ఆర్.టి.పి., ఎన్.ఐ.ఆర్.డిబీ (భారత ప్రభుత్వం), హైదరబాద్, కో-ఆర్డినేటర్ ఆ గ్రామా సర్పంచ్ వీరందరి సమక్షములొ ఒప్పందాలను చేసుకొని వారందరి సమక్షములొ ఒప్పంద పత్రాన్ని వ్రాసుకొని, గ్రామంలో ప్రారంభించారు. అప్పుడు ఆ గ్రామంలోనే నివసించే ఇద్దరు నిరుద్యోగ యువకులకు సంవత్సరము పాటు ఒక్కోరికి నెలకు జీతంగా మూడు వేల(రూ.3,000/-) చొప్పున ఇద్దరికెసి నెలకు జీతాలకు ఆరు వేలు (రు.6,000/-) ఇలా సంవత్సారానికి జీతాలకు రూపాయలు డెబ్బై రెండు వేలు(రూ.72,000/-) ఖర్చు అవుతాయి, మిగిలిన రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు (రూ.2,28,000/-) ల నుంచి ఆ గ్రామంలోని 500 స్ట్రీట్ లైట్సుకు ఒక్క లక్ష అరువై ఎనిమిది వేల రూపాయలను(రూ.1,68,000/-) సంవత్సరం పాటు ఖర్చు పెట్టిన, మిగిలిన అరవైవేలను (రూ.60,000/-) ఆ జిల్లాకు చెందిన
జిల్లా ఐక్య టెక్నోవేషన్, ఆర్.టి.పి., ఎన్.ఐ.ఆర్.డి, (భారత ప్రభుత్వం), హైదరబాద్బీ కో-ఆర్డినేటర్జాబితాలోనికి వెళ్తాయి. (ఇలా ఆ జిల్లా కో-ఆర్డినేటర్ నెలకు జీతముల రూపాయలు ఐదు వేల రూపాయల్ని (రూ.5,000/-) సంవత్సరం పాటు తీసుకోవచ్చును...అనగా ఈ ''చారి'స్ పార్ములా ఐక్య రెడ్'' ను ఉపయోగించడం వలన. 500 స్ట్రీట్ లైట్స్‌కు ట్యూబ్ లైట్ డోమ్ లు వున్నా ఒక గ్రామంలోని గ్రామ పంచాయితీకి ఈ ''చారి పార్ములా'' ద్వారా ముగ్గురేసి నిరుద్యోగ యువకులకు సంవత్సరం పాటు జీతాన్ని ఇచ్చి ఉపాదిని ఇస్తూ ఆ గ్రామాపంచాయితీకి డబ్బులను ఆదా చేస్తూ, అతి ముఖ్యమైన పర్యవరణాము మరియు ప్రపంచ గ్లోబల్ వార్మింగ్ ను కాపాడుతూ, ముందుకు దూసుకుపోవచ్చును.
- అనంతోజు మోహన్‌కృష్ణ