Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ మౌనాన్ని చూసి
నా మది నివ్వెరపోయింది
నేనెన్ని సార్లు పిలిచిన నువ్వు విన్లేదు
కానీ నా గొంతు మూగబోయింది
నేను పిలుస్తూనే ఉన్నాను
నువ్వు వేరే ధ్యాసలో ఉండి
గమనింపక పట్టించుకోలేదు
నీ దగ్గరకు వచ్చిగట్టిగా పిలిచాను..
తుదకు నువ్వు నీ రెమ్మల కొమ్మలతో
నను పలకరిస్తున్నావు
నీ రెమ్మలు గాలి హదయంపై మీటితే
వచ్చే సంగీతం నా తనువుని
స్పశిస్తుంది...
నీ చల్లని చూపుల రూపం
ఎంతటి కోపతాపాలనైనా చల్లబరిస్తే
స్వార్థపుబైర్లు కమ్ముకున్న ఈ దష్టికి
సష్టి అందాన్ని, త్యాగ గుణాన్ని రుచి
చూయించేది నువ్వే..
నేనొక్కడినే కాదు నిను ఆరాధించేది
నేనొక్కడినే కాదు నిను అభిమానించేది
ఎవరెళ్లిన సరే నీ చల్లని తరువునీడలో
ప్రశాంతతకుర్చీలో హాయిగా సేదదీరెవారే
మండుటెండల్లో కూడా నీ ఒడిలో
చల్లటి పండువెన్నెల కురిసితే
కరడుగట్టిన మౌనంలో
గాలితో నీ సయ్యాటలు
నను ఊహలఉయ్యాలలో ఊపుతుంది..
స్వార్థం వాయుకాలుష్యం కంటే కూడా
తీవ్రంగా,
ఈ పుడమిపై
అన్ని పలకరింపులు మోసపూరితమే
ఒక్క నీ ఆత్మీయ పలకరింపు తప్ప..
- సర్ఫరాజ్ అన్వర్
9440981198