Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతమైన విశ్వంలో
మనిషిని ముందుకు నడిపేశక్తే
ఆత్మవిశ్వాసం
తోడెవరులేకున్నాజి
కూడదీసుకుంటేచాలు
కురుక్షేత్రాన్ని సైతం నెగ్గే నేర్పును మదినింపి
విజయకేతనం ఎగరవేయించేది
నీలోని మొహమాటాన్ని
పటాపంచలుచేసే పదునైన ఆయుధం ఆత్మవిశ్వాసం
లక్ష్యమెంతదైనా సరే
గురి తప్పక గమ్యాన్ని చేర్చే
మానసిక చైతన్యం
కలలకు రూపాన్ని ముందునిలిపి
నిన్ను అలా మలచి జగాన
నిను నిలిపే ఓ శిల్పి
సుడిగుండాలాంటి సూటిపోటి మాటలను మాయంచేసే మంత్రదండమది
అద్భుతాలను ఆవిష్కరించేది
ఆనందాలను అందించేది
నిస్ప్రుహ నిస్సత్తువ నిశిని
నీ వైపు రాకుండా
నవ చైతన్య దీప్తులను
నీ చుట్టూ కంచెలా ఉంచి
నిన్నో ఓటమెరుగని ధీరునిగా
రాటుదేల్చే వెలుగు నక్షత్రమిది
జీరోలనందరిని హీరోలుగా
తీర్చిదిద్దే విజయశిఖరమది
అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా
పరిస్థితేదురైనా పట్టువిడవని
ఆత్మవిశ్వాసంతో నెట్టుకురావాలి నెగ్గుకురావాలి
- సి. శేఖర్(సియస్సార్), 9010480557