Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిరోజూ ప్రభాతవేళలోనే
ప్రభవించే బాలభానుడిని
నీ కనుబొమ్మల ఊయలలో
పడుకోబెడతావు!
రాత్రినుండీ ఉదయం వరకూ
నీలాకాశవక్షానికి పూచే
చుక్కల పూలను తెంపి,మాలగా కూర్చి
నీ సిగలో తురుముకుంటావు!
బహుళపాడ్యమి నుండి
చంద్రుడిని తరుగుతూ
నీ నవ్వుల్లో మిళాయించి
చిలకరిస్తూ పలుకరిస్తుంటావుబీ
ఇందుకే కాబోలు...
నీ ప్రతి నవ్వులో చల్లని వెన్నెలలుబీ
ఇందుకేనేమో...
అమావాస్య వరకూ చంద్రుడు
రేఖల వారీగా తగ్గిపోతూ
శూన్యకిరణహస్తాలు!
నీతో ఉంటే నాకు ప్రతిక్షణం ఎన్నో వసంతాలుగా
తోస్తుంది!
నీవు నా తోడుగా లేకుంటే
పట్టపగటి ప్రతిక్షణం సైతం
గాఢాంధకారాల వేనవేల నిశీథినులై
భయపెడుతుంది!!!
- రఘువర్మ, 9290093933