Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాదక ద్రవ్యాల మత్తులో
నేటి యువతరం జోగుతోంది
నల్ల మందు మైకంలో ...
భ్రమల లోకాన విహరిస్తుంది
ఈ డ్రగ్స్ మహమ్మరి ...
పబ్బులు ,క్లబ్బులు హోటళ్లు
కాలేజీలు, యూనివర్సిటీలు
అంతటా యధేచ్చగా విస్తరించి
మారణ మదంగం మోగిస్తుంది
స్కూల్ పిల్లల సైతం వదలక
బలి పీఠంపై నిలబెడుతుంది
నల్ల మందు మహమ్మారి
బతుకును కుంగదీస్తుంది
జీవితాలను కాలరాస్తుంది
ఆత్మహత్యకు ఎగదోస్తుంది
అత్యారాలు, అఘాయిత్యాలు
ఘోరాలు నేరాలకు ప్రేరేపిస్తుంది
అదే తీరుగా
మేధను చిదిమేస్తుంది
మానవాళిని శాసిస్తుంది
జగతికి సవాల్ విసురుతుంది
ఈ మత్తు మాఫియాపై
ఉక్కుపాదం మోపకుంటే
మనిషి అస్తిత్వం ప్రశ్నార్థకం
ప్రపంచం అంధకార బంధురం
ఇప్పటికైనా
ప్రజలు, ప్రభుత్వాలు
సమిష్టిగా ఉద్యమిస్తేనే ...
డ్రగ్స్ చీడ పీడ విరగడయ్యేను
యువత భవిత భద్రంగుండేను
(డ్రగ్స్ మాఫియా
విస్తరిస్తున్న నేపధ్యంగా...)
- కోడిగూటి తిరుపతి,
9573929493