Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదంతే.. కాలం నేర్పే పాఠాలు
ఒక్కోసారి చూసినవి
విన్నవి భద్రతని బ్రమించే కాలం
గుండెను గాయం చేస్తాయని
రక్షించే గాలులు దునియా నిండా మెండని
ఆత్మ విశ్వాసంతో కలియతిరిగిన మనసు
ఆపన్నహస్తాలు మబ్బులచాటు అమావాస్య సూర్యుల్లౌతారని నమ్మిన క్షణాలు....
పొదుపు తాలూకు పునాదులు ఆవశ్యకత
గుర్తుచేస్తాయి..
ఆలీ మాటలు అగ్నికి నైవేద్యం
అమ్మ మాటలు వినని కర్ణాలు
కలగలసి రోడ్డున అరువుకై
ఎండమావి అప్పుకై తిరుగుతున్న..
ఆలోచనలు. ఒక్కక్షణం
పరువును తాకట్టు పెట్టల్సిరావడం..దుర్భరం
రెండు చేతుల సంపాదన ఉన్నోల్లు
కొంత ఎనుకటి వాటిని రెట్టుపు చేసినోల్లు
పరపతి ఆభరణన్ని సమాజ చేతికి కంకణంలా ధరించినోల్లు
మేమున్నమని వెన్నుతట్టి వెన్నెముక ఐనోల్లు
సాయం కంపును బరించలేక
హరిచంద్ర విరుద్ధ మాటల్ని
విశ్వప్రయత్నాలలో వల్లేవేయడంలో
రాటుతేలిర్రు..
ఎంతైనా..
ఎవని భరువు వాడే మోయాలే.
మంది కాళ్ళమీద బరువేసుడు
ఇప్పుడు అసలే వీలుకాదు..
ఎవని ఆపద నున్చి వాడే గట్టెక్కాలే
అందని సాయాన్ని నిందిస్తూ
కాలం గడపడం...
బుద్ది జీవికి
అంతక్షేమం కాదు....
-నాగరాజు మద్దెల, 6301993211