Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా హదయంతో దోబూచులాడిన
నా ప్రియ సఖీ...!!
నీ రాకకై నా నిరీక్షణ క్షణమొక యుగంలా..
ప్రతి నిమిషం ఓ కల్పంలా...
మోడువారిన జీవచ్ఛవంలా
జీవిస్తున్నాను !
నువ్వు వస్తున్నావని తెల్పిన మేఘసందేశం నాకందిన మరుక్షణం.. ..
నా చిన్ని గుండె పులకరించింది
లబ్ డబ్ బదులు
నీ ఘోషే...!!!!
నా హదయమనే దేవాలయంలో
నిన్నొక దేవతలా ప్రతిష్టించి...
చూపులనే తోరణాలుగా ... మాటలనే విల్లుగా ఎక్కుపెట్టి ... జ్ఞానేంద్రియాలనే పూజా విధానంతో
అనుక్షణం నిన్ను అర్చిస్తూ... తరిస్తున్నాను.
నువ్వొస్తున్న ధూమశకటం దుర్ఘనటకు గురెట్కందని
తెల్సిన మరుక్షణం
నా చిన్నిగుండె
వేయి వక్కలెట్కంది.
నీ జ్ఞాపకాల సంద్రంలో
చుక్కాని లేని నావికుడిలా
నడిసంద్రంలో కొట్టుకుపోతున్నా...
తీరం తెలియని తెరువరిలా..!!!!???
- తూర్పింటి నరేశ్ కుమార్, 8184867240