Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందేశాలు, వీడియోలు, ఆడియోలు, లింక్‌లు ఒకటేమిటీ.. ఎన్నెన్నో వాడుకునే సులభతరమైన యాప్ వాట్సాప్. ఇకపై వాట్సాప్ యూజర్లకు మరింత సౌకర్యాలను కలిగిస్తోంది. మూడు కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది. రెండు మొబైల్ వెర్షన్లో, మరొకటి డెస్క్‌టాప్ వెర్షన్లో తీసుకొస్తున్నట్లు ట్విటర్లో వాట్సాప్ పేర్కొంది. ఇప్పటికే ఈ ఫీచర్స్ పలువురు యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చాయి. తాజా అప్డేట్లో వాటిని పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.
డెస్క్‌టాప్ ఫొటో ఎడిటర్
వాట్సాప్ డెస్క్‌టాప్‌లో మనం పంపే ఫొటోలను ఎడిట్ చేయాలంటే ప్రత్యేకంగా ఫొటోషాట్ లేదా ఇతర ఫొటో ఎడిటింట్ టూల్స్ ఉపయోగించి ఎడిట్ చేసి షేర్ చేయాల్సిందే. ఇకమీదట మరింత సులభతరంగా.... డెస్క్‌టాప్ వెర్షన్లోనే ఫొటో ఎడిట్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది.
ఎలా అంటే...
మనం ఇతరులకు పంపాలనుకున్న ఫొటోను అప్లోడ్ చేయాలి, పేజ్ పై భాగంలో డ్రాయింగ్ టూల్ కనిపిస్తుంది. టూల్లో ఎమోజీ, స్టిక్కర్, టెక్స్ట్, డ్రాయింగ్, క్రాప్, రొటేషన్ ఆప్షన్లు ఉంటాయి. ఆ ఆప్షన్లతో మీరు పంపుతున్న ఫొటోలో మార్పులు చేయొచ్చు. అలా వాట్సాప్ డెస్క్‌టాప్‌లోనే ఫొటోను ఎడిట్ చేసి పంపే వీలుంటుంది.
లింక్ ప్రివ్యూస్
యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్న వీడియో లేదా చదువుతున్న సమాచారం నచ్చితే దాని లింక్‌ని వాట్సాప్‌లో ఇతరులతో షేర్ చేసుకుంటాం. గతంలో ఈ లింక్ షేర్ చేసినప్పుడు దానికి సంబంధించిన థంబ్ సైజ్ ఫొటో, లింక్, పేరు వంటివి చిన్నగా కనిపించేవి.
తాజా అప్డేట్లో...
లింక్ షేర్ చేస్తే ఫొటో, లింక్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం మరింత పెద్దదిగా కనిపించేలా మార్పులు చేసినట్లు వాట్సాప్ తెలిపింది. దీనివల్ల యూజర్స్ తాము ఎలాంటి సమాచారానికి సంబంధించిన లింక్‌ను క్లిక్ చేస్తున్నామనే దానిపై మరింత అవగాహన ఉంటుందని వాట్సాప్ తెలిపింది.
స్టిక్కర్ సజెషన్స్
స్టిక్కర్ సజెషన్స్ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. పరీక్షల దశలో మెసేజ్ రియాక్షన్‌గా వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ వాట్సాప్ మెసేజ్‌లకు టెక్ట్స్తోనే కాకుండా స్టిక్కర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపే వీలుంటుంది.
ఎలా అంటే...
వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌కి రిప్లయి ఇచ్చేప్పుడు టెక్స్ట్‌కి బదులు మనలోని భావాన్ని ఎమోజీతో చెప్పొచ్చు. మీకు వచ్చిన మెసేజ్‌కి రిప్లయి ఇవ్వటానికి సదరు మెసేజ్‌పై క్లిక్ చేసి రిప్లయి ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు స్టిక్కర్లతోపాటు టెక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒక వేళ మీకు ఎక్కువ స్టిక్కర్లు కనిపించకపోతే.. పక్కనే ఉన్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన స్టిక్కర్స్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.