Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం కాగడై కలయికకై కన్నీరై చూస్తుంది
కలుస్తామని కంగారెందుకు....,
నువ్వెదురైనా
నా చూపు నీవైపు మలుపను,
మలిపినా నేనెవరో తెలపను,
తెలిపినా నీ మనసును తాకను,
తాకినా నీ నీడలో నడవను,
నడిచినా నీ అడుగులను ఆపను,
ఆపినా నా కన్నీరు చూపను,
చూపినా కారణం నువ్వని చెప్పను,
చెప్పినా విరహం నీతో విప్పను,
విప్పినా నీ జాలి నే పొందను,
పొందినా నీకై నే ఎదురుచూడను,
చూసినా నా వలపు నీచు వివరించను,
వివరించినా ఈ హదయం అతికదు, ,
అతికినా ఇకపై చితకదని నేననను,
నేనన్నా అది నిజమవ్వదు....!
- నిత్య లాడే