Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురాతన విజ్ఞానం, ఆధునిక సాంకేతికతల మధ్య పెనవేసుకున్న అల్లిక ఇది. ఒక్క మేకూ దిగకుండానే, ఎక్కడా అతుకు పడకుండానే కలపతో అత్యంత సహజంగా కుర్చీలు, బల్లలూ తయారు చేసే వ్యక్తి ఒకరున్నారు. అతను చేసే ప్రతీ వస్తువూ దేనికదే విలక్షణం, కాగడా పెట్టి వెతికినా ఒకదానిని పోలిన మరొకటి కనిపించదు. ఎందుకంటే అవి ప్రకతీ,కళాకారుడు కలిసి తీర్చిదిద్దిన అద్భుతాలు! సాధారణంగా గుమ్మం ముందు పందిరికో, పోర్టికో మీదుగానో లతలు, తీగలను పాకించి మురిసి పోతుంటాం మనం. వాటి ఆకతులను చూసి అబ్బురపడుతుంటాం. అలాంటిది చెట్లనే ఫర్నిచర్‌గా ఇంగ్లాండుకు చెందిన గావిన్ మన్రో మలచిన తీరు చూస్తే, మన ఆశ్చర్యానికి అవధులుంటాయా ! ఒక్కో వస్తువు తయారు కావడానికి ఏడెనిమిదేండ్ల కాలం పడుతుందంటే, అమ్మో అని నోరెళ్ళ బెట్టకుండా ఉంటామా!
చెట్లకు పూలు పూస్తాయని, కాయలు కాస్తాయని మనకు తెలుసు. ఆ కాయలు పళ్లవుతాయనీ తెలుసు. ఆ పళ్లను చెక్క టేబుల్‌పై పెట్టుకొని చెక్క కుర్చీలో కూర్చొని తినాలంటే... ఏపుగా పెరిగిన చెట్లను నరికేసి వాటితో చేసిన ఫర్నీచర్‌ను తెచ్చుకోవాల్సిందే. చెట్లను నరికేయడమంటే పర్యావరణ పరిరక్షణకు మనం హాని చేసినట్లే. అలాంటి హాని తలపెట్టకుండానే చెట్లకే మనకు కావాల్సిన రీతిలో కుర్చీలను, టేబుళ్లను కూడా పండిస్తే... అచ్చంగా ఇదే ఆలోచన వచ్చిన లండన్‌కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ డిజైనర్ గావిన్ మన్రో కి. తన ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టలాలనుకొని తన ప్రయత్నాలను ప్రారంభించాడు. అందుకు పేరణ తాను చిన్నప్పుడు చూసిన ఒక బోన్సారు మొక్క, తనకు జరిగిన వెన్నుముక ఆపరేషన్ లే. ఆ ఆపరేషన్‌లో బాగంగా శరీరాన్ని నిటారుగా ఉంచడానికి ఒక ఫ్రేమన్ను బిగించేవారు. రోజులతరబడి ఒకే స్థితిలో శరీరాన్ని ఉంచడం గమనించడంతో పాటు పెద్దయ్యాక ఫర్నిచర్ డిజైన్‌లో డిగ్రీ చేశాడు. సహజమైన వస్తువులతో ఫర్నిచర్ తయారు చేసే విధానంలో అప్రెంటిస్ షిప్ కూడా పూర్తి చేసిన మన్రోకి ఆ సమయంలో మొక్కలనే ఫర్నిచర్‌లా సహజంగా పెరిగేట్టు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది.
పురాతన విజ్ఞానం, ఆధునిక సాంకేతికతల మధ్య పెనవేసుకున్న అల్లిక ఇది. ఒక్క మేకూ దిగకుండానే, ఎక్కడా అతుకు పడకుండానే కలపతో అత్యంత సహజంగా కుర్చీలు, బల్లలూ తయారు చేసే వ్యక్తి ఒకరున్నారు. అతను చేసే ప్రతీ వస్తువూ దేనికదే విలక్షణం, కాగడా పెట్టి వెతికినా ఒకదానిని పోలిన మరొకటి కనిపించదు. ఎందుకంటే అవి ప్రకతీ, కళాకారుడు కలిసి తీర్చిదిద్దిన అద్భుతాలు! సాధారణంగా గుమ్మం ముందు పందిరికో, పోర్టికో మీదుగానో లతలు, తీగలను పాకించి మురిసి పోతుంటాం మనం. వాటి ఆకతులను చూసి అబ్బురపడుతుంటాం. అలాంటిది చెట్లనే ఫర్నిచర్‌గా ఇంగ్లాండుకు చెందిన గావిన్ మన్రో మలచిన తీరు చూస్తే, మన ఆశ్చర్యానికి అవధులుంటాయా ! ఒక్కో వస్తువు తయారు కావడానికి ఏడెనిమిదేండ్ల కాలం పడుతుందంటే, అమ్మో అని నోరెళ్ళ బెట్టకుండా ఉంటామా! మొక్కలను మౌల్డ్ చేయడం
మొక్కలకు ప్లాస్టిక్ మౌల్డ్‌లు అమర్చి వాటి కొమ్మలను తాను తయారుచేయదల్చుకున్న వస్తువులకు అనుగుణంగా పెరిగేట్టు పంచుతూ, కత్తిరిస్తూ మొక్కను మలచుతాడు. ఆ మొక్క దఢంగా పెరిగేట్టు చూస్తాడు. పూర్తిగా కావలసిన వస్తువు ఆకారం వచ్చాక శీతాకాలంలో మొక్క నుంచి వస్తువు ఆకారాన్ని వేరు చేస్తాడు. పచ్చిదనం పోయే వరకూ ఆరబెట్టి, నునుపుగా చిత్రిక పట్టి పాలిష్ వేయిస్తాడు. ఒక్క మేకు అవసరం లేకుండానే, ఎక్కడా గమ్ పెట్టి అతకకుండానే, ముక్కలు జాయింట్ చేయకుండానే తయారయ్యే ఈ ఫర్నిచర్ మన్నిక మామూలు ఫర్నిచర్‌తో పోలిస్తే చాలా ఎక్కువంటాడు గావిన్. ఒక్కో కుర్చీ తయారవాలంటే సుమారు ఎనిమిదేళ్ళు పడుతుంది. అద్దం చుట్టూ బిగించే ఫ్రేములు, లాంప్ షేడ్స్ వంటి చిన్న చిన్న వస్తువులు తయారు కావడానికి కాస్త తక్కువ సమయమే పట్టినా అదీ రోజుల్లో, నెలల్లో తేలే వ్యవహారం ఏమీ కాదు. ఈ ఫర్నిచర్ తయారీకి ఎక్కువగా విల్లో ట్రీనే ఎంచుకుంటాడు. వీటితోపాటు యాష్, హాజెల్, క్రాబ్ యాపిల్, సెసైల్ ఓక్, రెడ్ ఓక్ వంటి మొక్కల మీద కూడా ప్రయోగాలు చేస్తూ విభిన్న మైన లుక్, ఫినిష్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రతి వంద మొక్కలకూ ఒక పర్యవేక్షకుడు ఉండాలట. అంటే అతగాడు దాదాపు వెయ్యి కొమ్మలను, పదివేల చిగుళ్ళను నిరంతరం పర్యవేక్షించాలి. అందుకు ఓపిక చాలా అవసరం. గావిన్ 'ఫుల్ గ్రోన్' పేరుతో ఈ రకమైన ఫర్నిచర్ తయారీని భారీగా పారిశ్రామిక స్థాయిలో చేపట్టాడు. తన క్షేత్రంలో సోలార్ విద్యుత్‌ను ఉపయోగించడమే కాకుండా, మొక్కలకు బిగించే ప్లాస్టిక్ మౌల్డ్లలకు రీ సైక్లబుల్ ప్లాస్టిక్‌ని వినియోగిస్తూ, మరుగుదొడ్ల నుంచి వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయిస్తూ మామూలు ఫర్నిచర్‌తో పోలిస్తే అతి తక్కువ ఖర్చు, శక్తి వనరుల వినియోగంతో వీటిని రూపొందిస్తున్నాడు. విల్లో మొక్కలతో
వైవిధ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడే ఈ తరహా ఫర్నిచర్ తయారీలో మొక్కలను కత్తిరించినప్పటికీ వాటి మానులను పెకిలించకుండా తిరిగి మరో వస్తువు కోసం వాడుకోవడం వల్ల డీఫారెస్టేషన్నూ తగ్గించగలం. కాస్త వ్యయప్రయాసల వ్యవహారమే అయినప్పటికీ ఈ విధానంలో దాదాపు 75 శాతం శక్తి వనరులు ఆదా అవుతున్నాయి అంటున్నాడితడు. తమ సంస్థ ద్వారా 2016 నాటికి మార్కెట్లోకి చిన్న తరహా ఫర్నిచర్‌ను ప్రవేశపెడతామని, కుర్చీలు, టేబుళ్ళ వంటి పెద్ద వస్తువుల కోసం మాత్రం మరో రెండేళ్ళు ఆగాల్సిందే నంటున్నాడు గావిన్ మన్రో. తన ఆధునిక పంట కోసం విల్లో మొక్కలను ఎంచుకున్నారు. ఆ మొక్కలను నాటి వాటిపై కావాల్సిన రూపం గల కుర్చీలు, టేబుళ్ల ప్లాస్టిక్ నమూనాలను అమర్చి వాటి చుట్టూ మొక్కలు అల్లుకునేలా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వాటిని మౌల్డింగ్ చేస్తూ వచ్చారు. అంతే... ఆయన కోరుకున్న రూపంలో కుర్చీలు, టేబుళ్లు తయారయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో ఇప్పుడు ఏకంగా 400 టేబుళ్లు, కుర్చీలు, లాంతరు బుట్టల తయారీకి పెద్ద ఎత్తున మొక్కలు వేశారు. ఇప్పుడు అవి కోరుకున్న ఫర్నీచర్ రూపంలో పెరుగుతున్నాయి. ఈ పంట తన చేతికి రావాలంటే మరో ఏడాది పడుతుందట. వాటిని 2017 లో మార్కెట్లో విడుదల చేస్తానని మన్రో చెబుతున్నారు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే ప్రకతి సిద్ధమైన టేబుళ్లను, కుర్చీలను తాను సరఫరా చేయలేనని, ఈ ఫర్నీచర్ అందుబాటులోకి రావడానికి మొక్కలు నాటిన నుంచి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని ఆయన తెలిపారు. పెరగడానికి తక్కువ సమయం తీసుకునే మొక్కలను ఎంచుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే పెంప కంలో రైతుల సలహాలు తీసుకోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు.
- అనంతోజు మోహన్ కష్ణ