Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడుగులు అవకాశాన్నందుకునేందుకు
ఆరాటంతో ఆశతో
ఒళ్ళంతా కళ్ళుజేసుకుని
ఆ వైపుగా పయనం
ఆశల దీపపు వెలుగులో
లక్ష్య సాధన గమనం
జీవితనావను తీరానికి చేర్చేందుకు
వ్యూహాలనెన్నో మదిలో చిత్రించుకుని
ఓపిక మంత్రం జపిస్తూ
తాననుకున్నది సాధించేందుకు
అంతర్మథనంలో
సాగరమధనం సాగుతున్నది
ఆలోచనలగాలులపుడు కదిలిస్తున్న
వివేచన ఆ చోటనే స్థిరంగా నిలబెడుతుంది
శత్రువుల్లా దాడిచేసే ఆటంకాలపుడపుడు
అడుగులకడ్డుతగిలి
ఎక్కడో విసరికొట్టాలని
ముప్పేట వేటాడుతారు
నిర్లక్ష్యపు నీడల్ని కమ్మేస్తరు
అయినా
నేనురుకుంటానా...
నా లక్ష్యానికెపుడో అత్మవిశ్వాసంతో అడ్డకట్టేసాను
నిత్యం భూమెపుడు సూర్యునిచుట్టు పరిభ్రమించినట్టు
నేను నా లక్యంచుట్టే
లేదంటే
నా కలలసౌధం కుప్పకూలిపోతోంది
సాగితేనే గెలుపు
ఆగితేనే ఓటమి
నెట్టుకుంటూ తట్టుకుంటూ
శిఖరమైతే చేరాలి
- సి. శేఖర్(సియస్సార్),
9010480557.